Monday, April 11, 2022

Teacher n Teaching

 *_టీచింగ్ అంటే వృత్తి కాదు.... విలువలతో కూడిన జాతి నిర్మాణం.... [ఈ చిన్న కథ విన్నారా....?!]_*

*🌹🙏🌹🙏🌹 🙏 🌹 🙏 🌹*

*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి.... అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లకు మొక్కాడు... మాస్టారూ! బాగున్నారా..?'*

*'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?' 'ఎవరు బాబూ నువ్వు..?* *చూపు సరిగ్గా ఆనడం లేదు... గుర్తుపట్టలేక పోతున్నాను' 'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*

*'ఓహ్, నిజమా..? చాలా సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*

*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?' 'నేను టీచరు అయ్యాను మాస్టారూ...*

*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*

*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే నాకు స్పూర్తి తెలుసా..?'*

*'అదేంటి..? అదెలా..?' 'బహుశా మీకు గుర్తుండదు. ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!*


*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు...* *దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది...*

*ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను...* *కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది... లబోదిబో ఏడ్చాడు...*

*టీచరు కంప్లయింట్ చేశాడు... అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే...*

*ఒరేయ్ పిల్లలూ! ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు... నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది...* *అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా...*

*అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..? కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు...* *ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు... కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.... జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు...*


*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు... అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు...*

*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు. ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించనూ లేదు,* *నలుగురిలో నా ఇజ్జత్ పోకుండా మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర గనక వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో... అలా నన్ను రక్షించారు మీరు...*

*నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్... కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా...* *నా అంతట నేనే మారిపోయేలా చేశారు... ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..?* *ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*


*అప్పుడు ఆ టీచర్ సావధానంగా ఇలా చెప్పాడు... “ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...*

*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*

*(మంచి ఉపాధ్యాయులందరికీ అంకితం...* 🙏)

Friday, April 8, 2022

The Power of Devotional service

 The Power of Devotional Service to Krishna!

If One Performs even a Little Devotional Service, It Is not Lost

When one begins again, he begins at the point where he has left off.


When I read these following quotes I realised that we may underestimate the power of simple acts of service and devotion, such as paying obeisances, or chanting and dancing during kirtans.  They can seem so insignificant, but they are full of spiritual power.  Encouraging our children to engage in such simple acts of devotional service is also of such immense benefit to their spiritual development!


---------------------

Bhagavān Śrī Kṛṣṇa is present in the temple Deity, and even if a child comes to offer his respects, he is counted as a devotee. A small child may not know anything, but simply by seeing the Deity, chanting and dancing, he is benefited. Temples are meant to give everyone a chance to advance in Kṛṣṇa consciousness one step at a time.

sv-alpam apy asya dharmasya

trāyate mahato bhayāt

“A little advancement on this path can protect one from the most dangerous type of fear.” (Bhagavad-gītā 2.40) Even if we do a little on the path of bhakti, it goes to our account. For instance, if we deposit only two dollars in a savings bank, it is kept in our account, and it will increase with interest. Similarly, if one performs even a little devotional service, it is not lost. One may come and join this Kṛṣṇa consciousness movement, render some service and after a while fall down. However, whatever service has been rendered is to one’s permanent credit. That will never be lost. When one begins again, he begins at the point where he has left off."


"Even by sentiment one comes to Kṛṣṇa consciousness and discharges the regulative duties, chants Hare Kṛṣṇa, his next life is guaranteed as a human being. Even he does it for some time—he is not perfect—still, his next life is guaranteed. But others, there is no such guarantee. Even if he discharges his so-called duties, material duties, there is no guarantee that he'll become a human being."


(Srila Prabhupada Morning Walk, Nairobi, November 2, 1975


"The time one devotes in a Kṛṣṇa consciousness temple cannot be taken away. It is an asset—a plus, not a minus. The duration of life, so far as the body is concerned, may be taken; however one tries to keep it intact, no one can do it. But the spiritual education we receive in Kṛṣṇa consciousness cannot be taken away by the sun. It becomes a solid asset."

(Easy Journey to Other Planets, Chapter 2)


"In a firm relationship with the Lord, the devotee does not give up the Lord's service under any circumstance. As far as the Lord Himself is concerned, if the devotee chooses to leave, the Lord brings him back again, dragging him by the hair."

(Caitanya-caritāmṛta Madhya 15.154, Purport

Sunday, April 3, 2022

Gare and Mahabharatham - తింటే గారెలు తినాలి - వింటే భారతం వినాలి

 *🍀తింటే గారెలు తినాలి🍀*

*వింటే భారతం వినాలి*

అని పెద్దలు ఎందుకు అన్నారు?

*"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్"* - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి.

“ దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, కవులు మహాకావ్యమనీ అంటారు. లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, ఐతిహాసికులు ఇతిహాసమనీ, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు. వివిధ తత్త్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. ”

మహాభారత గాథను *వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి* చేత సర్పయాగం చేయించేటపుడు *జనమేజయ మహారాజుకి చెప్పించగా*, అదే కావ్యాన్ని తరువాత *నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు* చెప్పాడు.

*వింటే భారతం వినాలి తింటే గారెలే(మినప వడలు) తినాలి.*

*మినుము శరీరానికి ఇనుము.*

*భారతం మనసుకు బలము.*


ఇన్ని వంటకాలుండగా *గారెలతోనే ఎందుకు పోల్చారంటే.*

గారెలు మహా వంటకం.

భారతం మహా గ్రంధం.

*గారెలను ఏ కాంబినేషన్ (పచ్చడి) తో ఐనా తినచ్చు. విడిగా నైనా తినచ్చు.*

*అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, రసం, సాంబారు, పెరుగు,చెరుకు పానకం ఇలా దేనితో తిన్నా బావుంటుంది.*


*న్యూడిల్స్ తినాలంటే సాస్ తోనే తినాలి.*

*బిర్యానీ తినాలంటే సెరువా తోనే తినాలి.*

*పూరి ఆలుగడ్డ కూర తోనే తినాలి*


ఇలా *గారెలకు ప్రత్యేకమైనా కాంబినేషన్ అవసరం లేదు.*


*భారత కధ ప్రతీ ఇంటి కధ.*

*ప్రతీ మనిషి వ్యధ, రొద,సొద.*

*ఆపదలనుండి కాపాడే సుపధ*

*ధర్మాన్ని కాపాడే గాథ.*


దీనిలోని భాగాలకు పర్వాలు(చాప్టర్స్18)

అని పిలిచారు

18 భాగాలను మహాభారతం జయగ్రంధం అని పిలిచారు. పెను *చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు.* 18 కణుపులు (పర్వములు) కలిగిన 

పెద్ద చెరకుగడ. 

*మంచి చెరకును ఏ మూల నుండైనా మధ్యలోనుండి, చివరి నుండి ఎలా కొరికినా* నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ *జ్ఞానం పెరుగుతుంది.*


సమయాన్ని బట్టి మరికొన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం


Do extra, Dont go with crowd

 Study while others are sleeping 

Decide while others are delaying

Prepare while others are daydreaming 

Begin while others are procrastinating 

Work while others are wishing

Save while others are wasting

Listen while others are talking

Smile while others are frowning

Persist while others are quitting

Last but not the least 


*Chant* while others are prajalping


Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare 

Birth year in Telugu

 మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.👍

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)* శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి.👍

Thursday, March 31, 2022

How to celebrate Ugadi

 *ఉగాది { యుగాది }*


ఆచరణ విధానం


ఉగాది పర్వాన్ని ఆచరించే విధానాన్ని ‘దర్మసింధు’ అనే గ్రంధం, 


ఐదు విధి విధానాలు నిర్వహిస్తే పూర్తి అవుతుంది, అని చెప్తోంది.


ప్రతీ ఒక్కరూ ఈ ఐదు విధులను చక్కగా నిర్వర్తించాలి, 


అనే ఉద్దేశ్యం తోనే ఉగాదికి కొంచం ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది.


మీరు తెలుసుకొని, మీకు ముఖ్యం అయిన వాళ్ళకి కూడా, తెలియజేసి, కావలసిన పదార్థాలు, వస్తువులు సమకూర్చుకొని, పర్వదినం చక్కగా శాస్త్రబద్ధంగా చేసుకోండి. 


సనాతనధర్మం ఆచరించండి, హైందవ సంస్కృతిని పరిరక్షించండి. భావి తరాలు కి అందించండి.


ఇక,


ఐదు విధుల గురించి వివరంగా క్రింద పొందు పరుస్తున్నాను.


౧. తైలాభ్యంగనం, 


౨. నూతన సంవత్సరాది స్తోత్రం, { ప్రతీ సంవత్సరం పురుషునకు ఒక శ్లోకం ఉంటుంది}


3. నింబ కుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), 


౪. ధ్వజారోహణం {పూర్ణకుంభ దానం}, 


౫. పంచాంగ శ్రవణం


ఈ పైన తెలియజేసిన విధులను ప్రతీ ఒక్కరూ చేయాలని,


ఉగాది వ్రత గ్రంధం తెలియజేస్తూఉంది.


౧. తైలాభ్యంగనం


తైలాభ్యంగనం అంటే నువ్వులనూనె తో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. 


ఉగాది వంటి శుభ దినాలలో సూర్యోదయాని కి పూర్వము మాత్రమే, మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారు అని ఋషుల మాట.


కావున నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేసిన, 


లక్ష్మిదేవి, గంగా మాత అనుగ్రహాన్ని పొందగలుగుతారు.


అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం 


అంటే,


అభ్యంగన స్నానం, అన్ని అవయవాలకు పుష్టి దాయకం అని అర్థం. {శరీర అవయవాలు గట్టి పడతాయి}


ఆరోగ్య రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగన స్నానం కు విశేష ప్రాధాన్యత ఉన్నది.


౨. నూతన సంవత్సర స్తోత్రం


అభ్యంగ స్నానానంతరం, 


సూర్యునికి, ఆర్ఘ్య, దీప, ధూపాధికాలు, 


పుణ్యకాలానుష్టానం ఆచరించాలి.


తరువాత, మామిడిఆకుల తోరణాలతో, పూల తోరణాలతో, దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచాలి.


సంవత్సరాది దేవతను, ఇష్ట దేవతారాధన ను, మరియు పంచాంగాన్ని కూడా ఉంచి, పూజించి, ఉగాది ప్రసాదాన్ని {ఉగాది పచ్చడి} నివేదించాలి.


3. ఉగాది పచ్చడి తినటం


ఉగాది రోజున, ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యం.


వేప పువ్వులు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, మామిడి పిందెలు, కారం కలిసిన షడ్రుచుల రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం!


అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ 


అని ధర్మసింధు గ్రంధం చెబుతున్నది. 


ఈ ఉగాది పచ్చడి ని ఇంట్లో అందరూ పరగడుపున { ఖాళీ కడుపుతో } సేవించవలెను. 


ఉగాది పచ్చడి సేవించడం వల్ల, సంవత్సరమంతా సౌఖ్యదాయకం అని ఈ శ్లోకము యొక్క భావం.


షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి, కేవలం రుచిగా ఉండటమే కాకుండా, ఔషద గుణాలు తో, మరెన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది.


తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అనే ఆరురుచులు జీవితములో సుఖాలు, కష్టాలు, జీవితంలో అన్ని  అనుభూతులు కి తార్కాణం ప్రతీకాత్మకగా నిలుస్తూ ఉన్నాయి.


సుఖాలకు పొంగి పోవద్దు, 

దుఃఖానికి కృంగి పోవద్దు,

సుఖదుఃఖాలు సమభావం తో స్వీకరించు అనే సందేశాన్ని ఈ పచ్చడి మనకి ఇస్తూ ఉంది.


అంతే కాకుండా, ఈ పచ్చడి తినటం వలన, వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి కూడా చేకూరుతుంది.


4. పూర్ణకుంభ దానం


ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారం గా ఉన్నది. 


ఒక పట్టు వస్త్రాన్ని, 

ఒక వెదురుగడకు పతాకం వలె కట్టి, 

దానిపై కొబ్బరిబొండం తో కలశాన్ని వుంచి, 

ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి,

ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం అంటారు.


యధా శక్తి, రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కొత్తకుండ ను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు), సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేయాలి.


పూజించిన కలశానికి, 

ఒక నూతన వస్త్రాన్ని చుట్టి,

కలశంపై, పసుపు కుంకుమ చందనం, పసుపుదారాలతో, 

అలంకరించిన కొబ్బరిబొండం ను ఉంచి పూజించాలి.


పురోహితునకు గాని, గురుతుల్యులకు గానీ, 

పూర్ణకుంభ దానము ఇచ్చి,

వారి ఆశీస్సులు పొందడం వల్ల, 

సంవత్సరం పొడవునా విశేషఫలితం లభిస్తుందని ప్రతీతి.


5. పంచాంగ శ్రవణం


తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచఅంగాల సమన్వితం పంచాంగం. 


ఉగాది నాడు దేవాలయంలో గాని, 

గ్రామ కూడలి ప్రదేశాల్లో గాని, 

పండితుల, సిద్థాంతుల సమక్షంలో,

కందాయఫలాలు స్థూలంగా తెలుసుకోవాలి.


చెప్పిన దాని అనుగుణం గా, సంవత్సరం పొడవునా నడచుకొవాలో,

ఉగాది రోజున మన మనసులలో అంకురార్పణం చేసుకోవాలి.


ఉగాది నాటి పంచాంగశ్రవణం వల్ల,

గంగానదీ స్నానఫలితం లభిస్తుంది.


ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి,

సూర్యుడు శౌర్యాన్ని, 

చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, 

కుజుడు శుభాన్ని, 

శని ఐశ్వర్యాన్ని, 

రాహువు బాహుబలాన్ని,

కేతువు కులాధిక్యతను, కలుగచేస్తారు అని చెప్పబడినది.


‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత, తిరిగి సృష్టి ప్రార


ంభించు సమయాన్ని, ‘బ్రహ్మ కల్పం’ అంటారు. 


ఇలా ప్రతీ కల్పం లోను మొదట వచ్చే యుగాదిని,

యుగానికి ఆదిగా, 

ప్రారంభ సమయమును,

ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. 


ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభము అవడం వల్ల,


ఆ రోజు నుండి మన తెలుగుసంవత్సర ఆరంభదినంగా పరిగణించి, 


లెక్కించుటకు వీలుగా ఉండేందుకే, ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. 


లక్ష్మీ ప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. 


జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ఆ కాలాన్ని నిర్వచించేది పంచాంగ శ్రవణం, 


ముఖ్యంగా, ఉగాది సమయం లో ఇవన్నీ వినటం దేనికి? అనే అనుమానం కలుగుతుంది మనకి,


మనకి అందరి జీవులకు, కాల స్వరూపము రాబోయే సంవత్సరం, అందులో


గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలు, నివసిస్తున్నాయి.


దేనిలో ఏమిటి చేయవచ్చు, ఏది చేయకూడదు, అనే విషయాలు మనం తెలుసుకొని, మన యొక్క జీవితంలో ఆచరణ లోనికి తీసుకొని వచ్చే కార్యక్రమాల ఆలోచనలు చేయవచ్చు. 


ఆవిధంగా ప్రవర్తించినట్లు అయితే, రాబోయే కొత్తసంవత్సరం కి పూలబాట దైవసన్నిధిలో {ఇక్కడ కాల స్వరూపము దైవం} ఏర్పరచుకున్నట్లూ కూడా అవుతుంది.


మన జీవితం సాఫీగా జరగడానికి, ఆలోచించు కోవడానికి, మన ఋషులు ఏర్పరచిన బంగారుబాట పంచాంగశ్రవణం.


అన్ని తెలుసుకోండి, ఒకటికి పదిసార్లు చదివి ధర్మాన్ని ఆచరించండి. 


ధర్మమే మనలను కాపాడుతుంది.


ముందుగా అందరికీ కూడా ఉగాది మీకు చక్కని ఆరభం కావాలి అని ఆశిస్తూ....


*హరిహరాయ నమః*


🕉🕉🕉🕉🕉🕉

 *తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు* Telugu Year Names n Meanings

 *తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు*


1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.

2. విభవ - వైభవంగా ఉండేది.

3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.

4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.

5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.

6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.

7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.

8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.

9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.

10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.

11. ఈశ్వర... పరమేశ్వరుడు.

12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.

13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.

14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.

15. వృష ... చర్మం.

16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.

17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం

18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.

19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.

20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.

21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.

22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.

23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.

24. వికృతి... వికృతమైనటువంటిది.

25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.

26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.

27. విజయ... విశేషమైన జయం కలిగినది.

28. జయ.... జయాన్ని కలిగించేది. 

29. మన్మథ... మనస్సును మధించేది.

30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.

31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.

32. విలంబి... సాగదీయడం.

33. వికారి.... వికారం కలిగినది.

34. శార్వరి... రాత్రి.

35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.

36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.

37. శోభకృత్... శోభను కలిగించేది.

38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.

39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.

40. పరాభవ ... అవమానం.

41. ప్లవంగ... కోతి, కప్ప.

42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.

43. సౌమ్య... మృదుత్వం.

44. సాధారణ... సామాన్యం.

45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.

46. పరీధావి... భయకారకం.

47. ప్రమాదీచ... ప్రమాద కారకం.

48. ఆనంద... ఆనందమయం.

49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.

50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.

51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.

52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.

53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.

54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.

55. దుర్మతి... దుష్ట బుద్ధి.

56. దుందుభి ... వరుణుడు.

57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.

58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.

59. క్రోదన... కోప స్వభావం కలది.

60. అక్షయ... నశించనిది