Friday, February 26, 2021

Who is your GURU

 🚩🕉🙏


*ఈలోకంలో మనకు నిజమైన ' యజమాని* ' *ఎవరు.??* 

            🏵️🏵️🏵️


 *ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.* 


 *ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.* 


 *దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది.అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.* 


 *అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది.* *ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.* 


 *ఈ స్థితిలో ఉన్న ఆ* *"ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.* 


 *కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,* 

 *" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,* 


 *నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..* 

 *అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం,* *నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది* 


 *అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.??  అంది.* 


 *అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,* 


 *"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు,* *సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను* *వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ* *బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి* *తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు* *లాగుతారు .?? అంది.* 


 *ఇలా అన్న కొద్దిసేపటికి  ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా* *చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని..* *వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ* *అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.* 


 *ఈ కథలో...* 


 *ఆవు* -  *సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo* .


 *పులి* -  *అహంకారం నిండిఉన్న మనస్సు.* 


 *యజమాని* - *సద్గురువు/పరమాత్మ.* 


 *బురదగుంట* - *ఈ సంసారం/ప్రపంచం* 


 *మరియు,* 


 *ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : *నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడమo కోసం చేసే జీవన పోరాటం.* 


 *నీతి :* 


 *ఎవరిమీదా ఆధార పడకుండా జీచించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,* 


 *" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.* 


 *దీనినే* ' *అహంకారము* ' *అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.* 


 *ఈ జగత్తులో* *'సద్గురువు'*( *పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన* *మంచిని కోరుకునే వారు వేరే* *ఎవరుంటారు.?? ఉండరు.* 


 *ఎందుకంటే.??* *వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.* 


 *పరమాత్మా నీవే ఉన్నావు...!* 

 *అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!* 

🕉️🕉️🕉️🕉️🕉️

Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare 

Monday, February 22, 2021

What is free ?

 ఉచితంగా అంటే


 ఒక economics ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,

నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,

కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది....!!!

ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!


ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,

క్లాస్ లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు,

అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,

ప్రొఫెసర్ ok అన్నారు...

మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,


మొదటి సెమిస్టర్ లో,average ర్యాంక్ B వచ్చింది అందరికి,


2 nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,


3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,


ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,

స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,

బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,

చదువు తక్కువ చదివే స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,


ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,


1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,

కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు,


2. ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే 

మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,


3. గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,

ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,

4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,

కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,


సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,

అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,


మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,

ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,

అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది..

పార్టీలకతీతంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి నలుగురితో చర్చించండి...దేశం కోసం...రేపటి తరాల కోసం.....🙏🙏

Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare 

Friday, February 19, 2021

Aditya Hrudayam

 భగవద్బంధువులందరికి  #రధసప్తమి  శుభాకాంక్షలు..


#ఆదిత్య_హృదయం

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞


ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీరాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.  ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడి  ని చేస్తాడు. 


® వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండము నందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.


దీనిలో మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.


మొదటి రెండు శ్లోకాలు:

అగస్త్యుడు, శ్రీ రాముడి వద్దకు వచ్చుట.


3 నుండి 5 శ్లోకాలు  

ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.


 6 నుండి 15 శ్లోకాలు  

సూర్యుడంటే బయటకు వ్యక్తమవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంతఃస్వరూపము ఒక్కటే అని చెప్పడం.


16 నుండి 20 శ్లోకాలు  

మంత్ర జపం


21 నుండి 24 శ్లోకాలు 

సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు


 25 నుండి 30 శ్లోకాలు

పారాయణ వల్ల కలిగే ఫలం.


#ఆదిత్య_హృదయం_ప్రారంభం


🔸 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం

రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1


🔹 అర్థము:

యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసి యున్న శ్రీరాముడు సమరరంగమున చింతా క్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి యెదుట నిలిచి యుండెను.


🔸దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం

ఉపగమ్యాబ్రవీద్రా మమాగస్త్యో భగవానృషిః 2


🔹 అర్థము:

యుద్ధమును చూచుటకై దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి, ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను.


#అగస్త్య_ఉవాచ:


🔸 రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి 3


🔹 అర్థము  

ఓరామా! మహాబాహో! నాయనా! సనాతనము మిగుల గోప్యము ఐన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు.


🔸 ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం

జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4


🔹 అర్థము  

ఈ ఆదిత్యహృదయ అను స్తోత్రము పరమ పవిత్రమైనది. సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయములభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగ ప్రసాదించునది.


🔸 సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం

చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5


🔹 అర్థము   

ఇది పరమపావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరుచును. సర్వ జపములలో శ్రేష్ఠమైనది. కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యము.


🔸 రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం

పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6


🔹 అర్థము 

అనంతమైన బంగారుకిరణములతో శోభిల్లుచు, జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములన నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము.


🔸 సర్వ దేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః

ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7


🔹 అర్థము   

ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు. తేజో రాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని, స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు.


🔸 ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8


🔹 అర్థము   

బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు ,


🔸 పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః

వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9


🔹 అర్థము  

పితృదేవతలు. వసువులు, సాధ్యులు. అశ్వినీదేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నిము ఇతనివే. షడృతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే.


🔸 ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్

సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10


🔹 అర్థము  

ఆదిత్యుడు జగత్‌సృష్టికి కారకుడు. జనులు తమవిధులు నిర్వర్తించుటకు ప్రేరణయిచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షములద్వారా జగత్తును పోషించి తన కిరణములను ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు.


🔸 హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్

తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11


🔹 అర్థము 

శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడు. అసం ఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వముగలవాడు. రథమునకు ఏడు గుఱ్ఱములుగలవాడు. తేజో నిధానములైన కిరణములు గలవాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకై ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములచే ప్రకాశించుచుండువాడు.


🔸 హిరణ్యగర్భహ్శిశిరస్తపనో భాస్కరో రవిః

అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12


🔹 అర్థము 

బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు, తపింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు.


🔸 వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః

ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13


🔹 అర్థము  

ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయంసమయమున సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. అందువలననే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు.


🔸 ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః

కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14


🔹 అర్థము  

వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపువాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగి యుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.


🔸 నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః

తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15


🔹 అర్థము  

నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతియైనవాడు. విశ్వస్థితికి హేతువు. అగ్న్యాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. పన్నెండు రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం.


🔸 నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః

జ్యోతిర్గణాణాం పతయే దినాధిపతయే నమః 16


🔹 అర్థము  

స్వామీ! నీవు పూర్వగిరియందును, పశ్చిమగిరి యందును విలసిల్లుచుండువాడివి. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


🔸 జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః

నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17


🔹 అర్థము  

జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములుగలవాడవు. వేలకొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


🔸 నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః

నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18


🔹 అర్థము  

నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగ ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకై ఆవిర్భవించు నట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


🔸 బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః  19


🔹 అర్థము 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము.


🔸 తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే

కృతఘ్నఘ్నాయ దేవాయ *జ్యోతిషాం పతయే నమః 20


🔹 అర్థము  

తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును, శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించి నవారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతఘ్నులను నశింపజేయుచు, దివ్యతేజస్సు విరజిమ్ముచు, జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము.


🔸 తప్త చామీక రాభాయ హరయే విశ్వకర్మణే

నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21


🔹అర్థము: 

బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.


🔸 నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః  22


🔹 అర్థము: 

రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తును తపింపజేయును. వర్షములను ప్రాసాదించుచుండును.


🔸 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః

ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23


🔹 అర్థము: 

ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియే యుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫలస్వరూపమూ ఇతడే.


🔸 వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ

యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24


🔹 అర్థము  

ఇతడు వేదవేద్యుడు. యజ్ఞఫలస్వరూపుడు. లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు.


🔸 ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ

కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25


🔹 అర్థము  

రఘురామా! ఆపదలయందును, కష్టముల యందును, దుర్గమమార్గములయందును, భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించినవారికి నాశము ఉండదు.


🔸 పూజయస్త్వేనమేకాగ్రో దేవదేవం జగత్పతిం

ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26


🔹 అర్థము  

దేవదేవుడు, జగత్పతియైన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్యహృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహా సంగ్రామము నందు విజయము పొందగలవు.


🔸 అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి

ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం  27


🔹 అర్థము:

మహాబాహో! రామా! ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలిగి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను.


🔸 ఏతత్ శృత్వా మహాతేజా నష్టశోకోభవత్తదా

ధారయామాస సుప్రీతో రాఘవః ప్రియతాత్మవాన్ 28


🔹 అర్థము:

మహాతేజస్వియైన శ్రీరాముడు అగస్త్యమహాముని ద్వారా ఈ ఆదిత్యహృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఆదిత్యహృదయ మంత్రమును మనస్సు నందు నిలుపుకొనెను.


🔸 ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్

త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్  29


🔹 అర్థము:

పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్యభగవానుని జూచుచు ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను.


🔸 రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్

సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోభవత్ 30


🔹 అర్థము:  

మిక్కిలి సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను.


🔸 అథ రవి రవదన్నిరీక్ష్య రామం

ముదితమనాః పరమం ప్రహృష్యమాణః

నిశిచరపతి సంక్షయం విదిత్వా

సురగణమధ్యగతో వచస్త్వరేతి


🔹 అర్థము  

పిమ్మట దేవతలమధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమును పొందినవాడై, పరమ సంతోషముతో శ్రీరాముని జూచి రామా! త్వరపడుము అని పలికెను.


      🙏 శ్రీసూర్య నారాయణ పరబ్రహ్మణే నమః 🙏

Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare 

Friday, February 5, 2021

Fused Bulb Concept

 Fused Bulb Concept

     

A senior executive retired and shifted from his palatial official quarters to the housing society, where he owned a flat. He considered himself big and never talked to anyone. Even while walking in the society park every evening, he ignored others, looking at them with contempt. 

     

One day, it somehow transpired that an elderly person sitting beside him started a conversation, and they continued to meet. Every conversation was mostly a monologue with the retired executive harping on his pet topic, “Nobody can imagine the big post and high position I held before retirement; I came here due to compulsions”; and so on, and the other elderly person used to listen to him quietly.

     

After many days, when the retired executive was inquisitive about others, the elderly listener opened his mouth and said,  “After retirement, we are all like fused bulbs. It does not matter what a bulb’s wattage was, how much light or glitter it gave, after it gets fused.”

     

He continued, “I have been living in this society for the last 5 years and have not told anyone that I was a Member of the Parliament for two terms. On your right, over there is Vermaji, who retired as General Manager in Indian Railways. Over there is Singh Saheb, who was a Major General in the Army. That person sitting on the bench in spotless white dress is Mehraji, who was the chief of ISRO before retirement. He hasn’t revealed it to anyone, not even to me, but I know."


“All fused bulbs are now the same – whatever its wattage was – 0, 10, 40, 60, 100 watts – it doesn’t matter now. Neither does it matter what type of bulb it was before it got fused – LED, CFL, Halogen, Incandescent, fluorescent, or decorative. And that, my friend, applies to you too. The day you understand this, you will find peace and tranquillity even in this housing society.”

     

"The rising sun as well as the setting sun are both beautiful and adorable. But, in reality, the rising sun gets more importance and adoration, and is even worshipped , whereas the setting sun is not given the same reverence. It is better to understand this sooner than later”. 


Our current designation, title and power are not permanent. Keeping lot of emotions with these things only complicate our life when we lose this one day.


Remember that when the game is over, the king and the pawn go back in the same box.💡💡💡🙏🙏

Hare Krishna Hare Krishna 

Krishna Krishna Hare Hare 

Hare Rama Hare Rama 

Rama Rama Hare Hare