Saturday, April 4, 2020

👉🏻భగవధ్గీతలో ఏముంది?: (What is there in Bhagavadgita)

*హరే కృష్ణ* 

👉🏻భగవధ్గీతలో ఏముంది?:

భగవధ్గీతలో 700 శ్లోకములు ఉన్నాయి. వాటిని చదవడానికి ప్రస్తుత కాలంలో ఈ యాంత్రిక జీవన విధానంలో సమయం, సహనం రెండు ఉండవు. కనుక కనీసం కొద్ది నిమిషాల ఈ పరిచయంలో తెలుసుకుంటారనే భావనచేతఈ ప్రశ్న జవాబుల రూపంలో భగవధ్గీత అంటే ఏమిటో తెలుసుకుని తరిస్తారని ఆశిస్తూ ఇవ్వడం జరిగింది.
శ్లోకం:-పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?
జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.
2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?
జ. గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?
జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?
జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?
జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.

6. గీత ఎందుకు చెప్పబడినది?
జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?
జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?
జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.

9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?
జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.

10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?
జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.

11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?
జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము

12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?
జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.

13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి?
జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
4) అనసూయ - అసూయ లేనివాడు.
5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .

14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?
బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.

15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?
జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.

16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?
జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
"యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.

17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?
జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.
2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
ప్రార్దించువారు అర్దార్దులు.
3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,
సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును. 4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.

18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?
జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
6. యజ్ఞము 7.అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ
17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును
వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట 26.తంతుల స్వభావము లేకుండుట అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.

19. యోగమనగా నేమి?
జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
యోగమనగా ఆనందం
సమత్వమే యోగము
చిత్త వృత్తిని విరోధించునదే యోగము

20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?
జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.

21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?
జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.

22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?
జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.

23. "యోగం" అంటే అర్థం ఏమిటి?
జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .

24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?
జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా , శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. "యోగ: చిత్త వృత్తి నిరోద:" అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి - బుద్దిని,మనస్సును నిలిపి వుంచేదే యోగం. 'సమత్వం యోగముచ్యతే" - అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం.
25. భగవద్గీతలో ప్రధానమైన యోగములు ఏవి?
జ. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము , రాజ యోగము.

26. కర్మ యోగము అంటే ఏమిటి?
జ. కర్మ యోగము అంటే ప్రతి వ్యక్తీ తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థముగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్దిగా చేయుట.

27. కర్మ, వికర్మ , అకర్మలను స్వామి ఏవిదంగా విశదీకరించారు?
జ. స్వామి కర్మ, వికర్మ, అకర్మల గూర్చి చెపుతూ " దీపం వుంది. అది నిలకడగా వెలుగుతుంది - ఇది కర్మ. వికర్మ అంటే - ఆ దీపం నిలకడగా వుండక పరిసర ప్రభావాలకు లోనై వూగిసలడటం. ఇకపోతే అకర్మ - నిలకడగా వున్నా, లేక పోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం .

28. "కర్మణ్యే వ్యాధి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ: మాతే సంగోస్త్వ కర్మణి" శ్లోకార్థాన్ని తెలుపుము?
జ. "కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్ర్యము కలదు. కానీ ఆ కర్మలవల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుట యే నీధర్మం. ఫలము ఈశ్వరాధీనము ఫలాపేక్ష లేని వాడ వై కర్తవ్యమును ఆచరింపుము.

29. భక్తియోగము అంటే ఏమిటి?
జ. భక్తి యోగము అంటే "భగవంతునితో తనను తాను నిశ్చల, అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల, నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా, వాచా, కర్మణా భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము.

30. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములు ఏమిటి?
జ. నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగివుండటం మిత్రత్వము, దయార్ద్రహృదయము, అహంకార రహితము, సుఖ దుఖాలు యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి వుంటాడు. అంతే కాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై వుండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకొనువాడై నిజమైన భక్తుడు.

31. ఎట్టివాడు భగవత్ప్రేమకు పాత్రుడు కాగలడు ?
జ. అనా పేక్ష: శుచి: దక్ష: ఉదాసీనోగతవ్యధ:
సర్వా రమ్న పరిత్యాగి యోమద్భక్త: సమేప్రియ:
ఎట్టి ఆపేక్షలు (కోరికలు) లేనివాడు. అంతర్ , బహిర్ శుద్ది (పవిత్రత) కలవాడు. ఫలాపేక్ష రహితుడై కర్మల నాచరించేవాడు, గతమును గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రమూ విచారించనివాడు, ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచి పెట్టినవాడు నాకు యిష్టుడైన భక్తుడు" అని గీతాచార్యుడు పలికాడు.

32. జ్ఞానయోగము అంటే ఏమిటి?
జ. జ్ఞానయోగమంటే "నేనెవరిని? నేనెక్కడ నుండి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? " అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం.

33. జ్ఞానము ఎన్ని రకములు?
జ. జ్ఞానము - లౌకికము (భౌతికము) , ఆధ్యాత్మికము (దైవిక సంబంధమైన) అని రెండు రకములు.

34. జ్ఞానము ఏవిధంగా పొందగలము?
జ. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలిసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మ విశ్వాసము.
అసక్తి, స్థిరత్వము , నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే.

35. "రాజ యోగ" మనగా ఏమిటి?
జ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగము.

36. కర్మ, భక్తి , జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏవిధంగా విశదీకరించారు?
జ. కర్మ అనేది చెట్టుకు పూచే పూవు వంటిదనీ, భక్తి ఆ పూవు నుండి ఉద్భవించే కాయవంటిదనీ , జ్ఞానము పండిన పండు వంటిదనీ స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి.

37. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ వుంటుంది?
జ. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించు కోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ వుంటుంది.

38. మనస్సు అనగా ఏమిటి?
జ. సంకల్ప వికల్పములతో , కోరికలతో కూడినది మనస్సు.

39. మనస్సును ఎందుకు అదుపులో నుంచుకోవాలి?
జ. మనస్సు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో వుంచుకోవలెను.

40. మనస్సును ఎలా నియంత్రించగలం?
జ. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ది ఉండాలి. బుద్దిని అనుసరించాలి మనస్సు.
మానవుడు మనస్సును ఆధీనలో పెట్టుకుని వ్యవహరిస్తే అంత మంచి జరుగుతుంది ..



🌹హరే కృష్ణ🌸🌺

🌷అందరూ జపించండి🌷
*🌹జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌర భక్త బృంద* 🌹
(అని ఒక్కసారి చెప్పి)

☘" *హరే కృష్ణ హరే కృష్ణ* 
      *కృష్ణ కృష్ణ హరే హరే* 
      *హరే రామ హరే రామ* 
      *రామ రామ హరే హరే"** 
(108 సార్లు పలకండి)

😄సంతోషంగా ఉండండి😄

🍀 🌷🤷‍♂🤷🏻‍♀🤷🏻‍♀🤷‍♂🌷🌹

Thursday, April 2, 2020

Think

భగవత్ బందువులరా!
 చిన్న సందేశం అందరికి..
ఇప్పటికైనా ఆలోచించండి !
మరణం మనకు దగ్గరలో ఉంది..
        ఎలా! ఎలా ! అని ఆలోచిస్తున్నారా..
ఒక్కసారి మీ అంతకు మీరు ఆలోచించండి .
మనం అభివృద్ధి అని అంటున్నాం కదా .
ఏమైనది మన అభివృద్ధి?
మనల్ని మనం కాపాడుకోలేని అభివృది ఎందుకు ?.
ఎప్పుడైతే మన ఆచారాలను, కట్టుబాట్లను హేళన చేసి నాస్తిక భావనలోకి వచ్చామో అప్పుడే మొదలయ్యింది మన పతనం..
మన పూర్వికులు మనకు ఇచ్చిన సూచనలు కాదని పాచ్యాత్య సంస్కృతిని ఆచరించాము కదా..
"మన దేశం ఎపుడో చెప్పింది మన భూమి వేద భూమి ,కర్మ భూమి, భారతదేశం లో పుట్టడమే ఒక అదృష్టం లాగా భావిస్తారు.."అలాంటి మన  దేశాన్ని కాదని విదేశాల మోజులో పడి మన సంస్కృతిని నాశనం చేయాలని చూసారు కదా..
"వేరే సంస్కృతి మనల్ని నాశనం చేసింది.." కాదంటారా?

"మత్తు పదార్థాలు మద్యం,మాంసాహారం, వ్యబిచారం, జూదం"లాంటివి
ఎక్కువగా అయ్యాయి కదా ఇంకెందుకు మన పతనం జరగదు..తప్పక జరుగుతుంది.

ప్రకృతి మనకు తల్లి వంటిది..
అలాంటి తల్లికి భూమి మీద ఉన్న ప్రతి జీవి తనకు సంతానమే కదా..

కేవలం మనుషులే అని అనుకుంటే పొరపాటు,
మనకు భూమి మీద ఎంత అధికారం ఉందో మిగతా జీవులకు కూడా అంతే అధికారం ఉంది..

ఒక్కరోజులో ఎన్ని ముగజీవాలను మనము నాశనం చేసి తింటున్నామో ఆలోచించండి..
వాటి బాధ ఎవరికి అర్తం అవుతుంది..
మూగ జీవాలు కదా మనకు అర్తం కాదు వాటి ఘోష కేవలం అమ్మకు మాత్రమే అర్థం అవుతుంది(ప్రకృతికి).
ఆమెకు సంతానం మీద ప్రేమ ఉంది కాబట్టే మనల్ని ఇప్పటివరకు క్షమించింది..
కానీ మనం విచ్చలవిడిగా చేస్తున్న పాపాలకు, మోసాలకు ,కుట్రలకు, కుతంత్రాలకు,... భారతమాత విలవిల్లాడిల్లి పోతుంది.. ఒకప్పుడు ప్రశాంతముగా ఉన్న ప్రకృతి ఇప్పుడు వికారమై పోయింది కేవలం మన స్వార్థం వల్ల కాదంటారా?
భరించలేనంత అయితే ఎవరూ ఊరుకుంటారు కాబట్టే, మనకు తెలిసి రావాలనే ఉద్దేశంతోనే
మనం బయపడుతున్న ఈ వైరస్.. కాదంటారా?

"మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా! ఇప్పుడున్న పరిస్థితికి మనము దేవుణ్ణి నిందించాల్సిన అవసరం లేదు,  ఈ తప్పిదం కేవలం మన వల్లనే జరిగింది" కాదంటారా?
"ఎవరూ చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ..వారితోపాటే మిగతా వాళ్ళందరూ అనుభవించాల్సిందే.."
ఇప్పటి నుండి అయినా మీ
అందరు మంచి కార్యాలను, ఎదుటివారి సంతోషం ను కోరుకోండి,
మత్తు పదార్థాలు మద్యం,మాంసాహారం, వ్యబిచారం, జూదం లాంటివి వదిలివేయండి..
ఇవి పాపకార్యములు మరియు నరక ద్వారాములు..
మీకు అర్తం అవుతుందనుకుంటాను..
ప్రస్తుతం ఇప్పటికిప్పుడే మన మరణము తధ్యం అంటే ఏమి చేస్తారో ఆలోచించండి..ఒకసారి మీ అంతరాత్మను అడగండి..
మనం ఏ ఏ మంచి కార్యాలు చేసాము అని గుర్తు చేసుకోండి.
మన వల్ల ఎంత మంది నిజముగా సంతోషముగా ఉన్నారో !
మన వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో
ఎదుటి వాణ్ణి మనం ఎలా అవమానం చేసామో, కించపరిచామో!
మనం చేసిన పుణ్య కార్యాలు, పాపపు కార్యాలు రాసుకోండి
మనకే తెలుస్తుంది మనము ఏమి చేసాము అని..
ఎవర్ని కించపరచాలనేది మన ఉద్దేశం కాదు..
మరణము తెలుసుకున్న పరీక్షితుడు (7 రోజులలో చనిపోతాడు అని తెలుసుకున్నాక).
శుకదేవ గోస్వామి నుండి 7 రోజుల పాటు భాగవతాన్ని శ్రవణం చేసాడు (రాత్రులు, పగలు)..కేవలం బాగవతాన్ని మాత్రమే శ్రవణం చేసాడు.. ఎందుకంటే అది వినడం వల్ల మనం చేసిన పాపాలు పోయి మనకు మోక్షం
అందరూ భగవంతుని సాన్నిహిత్యాన్ని పొందగలరు మరణానంతరం..
కాబట్టి మరణం ఎప్పుడన్నా ఏ క్షణములో నైన రావచ్చు కాబట్టి
"సాక్షాత్తు భగవంతుడు అయిన శ్రీ కృష్ణ నామాన్ని (హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే) మరియు ఆయన స్వరూపం అయిన శ్రీమద్ భాగవతం చదవండి మరియు అందరికి వినిపించండి"

చాలా విచిత్రం అని అనుకోకండి మిత్రులారా, ఇదే వాస్తవం
"అంతేః నారాయణ స్మృతిః " అని అన్నారు చివరి క్షణములో భగవంతుని నామమే మనల్ని కాపాడుతుంది.. ఎవరూ మనల్ని కాపాడలేరు మన వాళ్ళు, మన తల్లిదండ్రులు, సమాజం, సోదరులు మన భార్య,భర్త,సంతానం ఎవరు మనల్ని కాపాడలేరు.. మన సంపద,సమాజము,దేశం ఎవరూ కాపాడలేరు..
కేవలం భగవంతుని నామమే కాపాడగలదు..
ఇప్పటికైన మేలుకోండి

☘🌹హరే కృష్ణ🌸🌺

🌷అందరూ జపించండి🌷

🌹జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాధి గౌర భక్త బృంద 🌹
(అని ఒక్కసారి చెప్పి)

☘"హరే కృష్ణ హరే కృష్ణ
      కృష్ణ కృష్ణ హరే హరే
      హరే రామ హరే రామ
      రామ రామ హరే హరే"
(108 సార్లు పలకండి)

సంతోషంగా ఉండండి

🍀 🌹🌷🌹
మన సనాతన ధర్మాన్ని ఆచరించుదాం సంతోషంగా ఉందాము
అందరూ బాగుండాలి
హరే కృష్ణ🙏🙇🏻‍♀

#LOCKDOWN

L - Listen to Krishna’s Voice, reflect.
O - Obey His Words.
C - Chant Krishna's Holy Name.
K - Know what is the purpose of all.
D - Dwell in His presence. Do not panic.
O - Offer a prayer for everyone’s safety.
W - Wait, be patient.
N - Nurture a personal relationship with Krishna.

Suggestion in Crisis

Dear loving divine brothers and sisters,
In this present world crisis moment most of us are confined to homes, thus inviting some illness if not careful. So out of my concern I am sharing some suggestions to all of you with all humbleness.
Exercise:
Daily dance for 30 minutes to the tune of Hare Krishna by Srila Prabhupada in the morning itself.
Carry out Pranayama for 15 minutes. Because of limited movement we tend to take less oxygen in to our system. Pranayamam Param Balam, as Lord Krishna said to Uddhav.
12 rounds of Surya Namaskar. This keeps your entire body so flexible and all joints in perfect condition.
All the above 3 activists will take around 50 minutes, which will ensure that you are absolutely fit.

Prasadam:

Restrict food intake to only two times. First around 11.00 to 12.00 noon and second at 8.00 pm. In between no snack, only water or diluted butter milk with little salt.
Morning you can take fruits as breakfast after your exercise. It helps fruit in take also for increasing alkalinity in the body.
Begin the day in the morning at 5.00 am with lemon juice and if you want you can take it in the evening also, exemption.
Recipe for lemon juice is one glass of lukewarm water, half lemon and 3 spoons of honey or some jaggery. For diabetics rock salt can be used. This is a wonder lemon juice to increase alkaline nature in your body.
If you like my suggestions follow it nicely. Depending on your reciprocation I can give some more next week same time. If you get more interest further messages for third week. By the time Coronavirus goes away you are more active than earlier with spring like action.
Dr. Vaishnavanghri sevaka Das
Self- practising Naturopathy Therapist
Conscience Therapist

PRACTICING SELF CONTROL During Lockdown

Will you over indulge (Over eat) or eat processed junk food?
Or will you get creative and take time to make nice offerings for Krishna?

Will you Order take out with nasty onion or garlic?
Or will you cook the things that you are craving and make them for Krishna? (Use Hing and natural or organic sugar)

Will you dumb yourself up with TV and time wasting video games...etc.? Or watch some devotee cooking class on line or devotional videos or listen to Srila Prabhupada lectures?

Will you sit and watch horrible news or will you read Srila Prabhupada's books?

Will you indulge in illicit sex due to boredom?
Married couples too? If you're not doing garbhodana samskara then what's the point? Do you want cats and gods for kids? Thats what happens when no samskara.

Will you zone out and sleep more?
Or chant more and do more devotional service?

Will you stay up late and sleep in past sunrise?
Or wake up early and do your puja aortic and chant your rounds?
It's up to you to have self control this is the test.

Parents with Kids..will you let your kids rule the house and drive you crazy?
Or will you take control and engage them in chanting, reading hearing and devotional activities? Keep the Kirtan or Prabhupada japa playing 24 hours .. (at night more softly if necessary) Sanctify your home.
Get creative ... make stuff for Krishna. (necklaces, garlands, decorations for the altar.. But do something or you will all drive each other mad.

It's all about training.. and if we have not had training then we get trained by hearing the Spiritual master Acharya Srila Prabhupada. So lets get busy. And clean Krishnas house for God's sake! Cleanliness is next to Godliness. Engage the kids in cleaning too. (While kirtan is playing of course).
You can't give things up without a higher taste and if you do not have the higher taste yet then the only way is to start developing the taste is by more devotional service. The only cure for Maya is Krishna.. the only cure for material activities is spiritual activities. The way to  cultivate a higher taste is to associate with devotees who have a higher taste. If you have no access to them.. then reading Srila Prabhupada's books and hearing his lectures is the way. Chant! Chant! Chant!
Hare Krishna! Nitai Gauranga Hari bol! Jaya Srila Prabhupada!

Ramayana Quiz

రామాయణం గురించి నాలుగు విషయాలు 😛 తెల్సుకోండి🙏

 👇👇👇👇👇
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..🏹

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
=తన మెడలోని.                 ముత్యాలహారం.

శ్రీ రామ జయం!🙏

Where r u god?

ఒక భక్తుడు
కరోనా సోకి స్వర్గస్తుడైనాడు.
వైకుంఠంలో
శ్రీ మహావిష్ణువుని చూసి...
"ప్రభు!
నేను నీ భక్తుడను, నన్ను కాపాడడానికి నీవు రాలేదు.
ఇది నీకు తగునా?"
అని ప్రశ్నించాడు.
దానికి
శ్రీమన్నారాయణుడు
చిరుమందహాసం చేసి,
"ఓ భక్తా గ్రేసరా!
నేను ప్రధాన మంత్రి రూపంలో,
ముఖ్య మంత్రి రూపంలో,
పోలీస్ రూపంలో,
మునిసిపాలిటీ ఉద్యోగి రూపంలో, నీ
కాలనీ కమిటీ సభ్యుని రూపంలో వచ్చి,
ఇంటిలోనే పడుండరా...!
అని పదే పదే చెప్పినా,
వినక, ఊరి మీద పడి  తిరిగావు. నీవేమైనా  అర్జునిడివా,
నీకు విశ్వరూపం దాల్చి వచ్చి
భగవద్గీత బోధించడానికి?"
😊😊😊😊😊
భగవంతుడు నేరుగా రాడు... రక రకాల రూపాలలో మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు పాపం. కానీ మనమే గుర్తిం చము😭

Ramanavami Prayers

భగవత్ భక్తులందరకి హరే కృష్ణ ముందుగ అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు,అందరూ కూడా ఇంట్లోనే ఉండి శ్రీరామ నవమి వేడుకలు మరియు హరినామము చేస్తూ ఈ క్రింది పద్యాలు కంఠస్థం చేయండి

శ్రీ రామ నవమి ప్రార్థనలు

 శ్రీ వాల్మీకి ప్రార్థనలు

 కూజంతం రామ రామేతి /
 మధురం మదురక్షరం /
 ఆర్యహ్య కవిత షాఖం /
 వందే వాల్మీకి కోకిలం //

 నైటింగేల్ వాల్మీకి నా నమస్కారాలు, ఎవరు పద్యం మీద కొమ్మలా కూర్చున్నారు, మరియు "రాముడు", "రాముడు" మరియు "రాముడు" అని మధురంగా ​​పాడుతూ ఉంటారు.



 వాల్మీకి ముని సింహాస్య / కవిత వన చరీనా /
 శ్రీన్వన్ రామ కథనాదం /
 కోన యతిమ్ పరాం గతిమ్ //

 ఈ ప్రపంచంలో ఎవరు విముక్తి పొందలేరు, ఎవరు రాముడి కథను వింటారు, కవిలలో వాల్మికి సింహం స్వరపరిచారు, ఎప్పుడూ అడవిలో నివసించేవారు.
 ****

 శ్రీ రాముడికి ప్రార్థనలు

 రామయ రామ భద్రయ / రామచంద్రయ వేధసే /
 రఘు నాథాయ నాథాయ / సీతయా పటేయే నమహా //

 రాముడికి, రామభద్ర, రఘునాథ (ఇవి రాముడి వేర్వేరు పేర్లు), భగవంతుడు, సీత యొక్క భార్య, మన నమస్కారాలు.
 **
అపధం అప హర్తారం / ధాతరం సర్వ సంపధం  లోకాభిరామం శ్రీరామం / భూయో భూయో నమఃమ్యహం//

 జీవా (జీవుల) యొక్క అన్ని రకాల కష్టాలను మరియు వేదనలను తొలగించేవాడు;  ఎవరు అన్ని రకాల అనుగ్రహం, గౌరవం మరియు సంపదను ఇస్తారు;  ఎవరిని చూడటం ద్వారా, ప్రపంచం చాలా సంతోషంగా ఉంది;  ఆ శ్రీ రాముడికి, నేను మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను
 ***

 దక్షిణా లక్ష్మణో యస్యా /
  వందే తు జనకాత్మజ |
 పురతో మారుతీర్ యస్య / తం వందే రఘునందనం ||

 రాముడి కుడి వైపున శ్రీ లక్ష్మణుడు మరియు ఎడమవైపు సీతాదేవి మరియు పాదాల ముందు మారుతి (హనుమంతుడు), ఆ రఘు వారసుడికి, నేను నా వినయపూర్వకమైన నమస్కారాలను అర్పిస్తున్నాను.
 ***

 రామాయణానికి ప్రార్థనలు

 వాల్మీకి గిరి సంభూత /
 రామ సాగర గామిని /
 పునాతు భువనం పుణ్య /
 రామాయణ మహానధి //

 వాల్మీకి పర్వతం నుండి మొదలై రాముడి సముద్రాన్ని కలుపుతున్న “రామా కథ” అని పిలువబడే ఈ నది ద్వారా ప్రపంచం మొత్తం పవిత్రంగా ఉండనివ్వండి.