Monday, August 26, 2019

నెల్సన్ మండేలా డైరీలో ఓ పేజీ:*



‘నేను నా అత్యంత సన్నిహితులైన కొందరు వ్యక్తులతో మధ్యాహ్నం భోజనానికి ఒక #హోటల్కివెళ్లాను.
 వేయుటర్ వచ్చి #మాఆర్డర్ తీసుకువెళ్లిన తర్వాత కాసేపటికి మా భోజనం వచ్చింది. 
సరదాగా మాట్లాడుకుంటూ,
 మేం తినడం ప్రారంభించేముందు నా #దృష్టి #ఎదురుటేబులలో_ఒంటరిగా_కూర్చున్నవ్యక్తి మీద పడింది. 
అతని #భోజనం_ఇంకారాలేదు. 
నన్ను అతడు చూడగానే చటుక్కున లేచి #బయటకువెళ్లడానికి ప్రయత్నిస్తుండగా అతని ఖర్మ కాలి #భోజనంవచ్చింది. 
అతను #నిస్సహాయంగా_కూలబడిపోయాడు. 

నేనతణ్ని చూసి, పలకరింపుగా నవ్వి, 
నాపక్కన కూర్చోమంటూ, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించాను. 

వెయిటర్ కు సైగ చేయగానే, అతడి భోజనం నా పక్కన పెట్టి వెళ్లాడు. 
#తప్పనిసరి_పరిస్థితుల్లో ఆ వ్యక్తి నా పక్కన కూర్చున్నాడు. 

మా భోజనం త్వరత్వరగా అవుతోంది. కానీ, #అతనికి_ముద్ద_గొంతుదిగడంలేదు. 
*చేతులు వణుకుతున్నాయి.* 
దిక్కులు చూస్తూ మాటిమాటికీ నీళ్లు తాగుతూ మొహం తుడుచుకుంటున్నాడు. 

మా అందరి భోజనం అయ్యాక అతను      సగం తిండిని కతికినట్టు చేసి వడివడిగా వెళ్లిపోయాడు. 

అతనిని గమనించిన నా మిత్రుడు బాగా _అనారోగ్యంగా ఉన్నట్టున్నాడు. అస్సలు తినలేకపోతున్నాడు. వణుకుతున్నాడు..!_" అంటూ ఓ జనాంతిక కామెంట్ వదిలాడు. 

_అప్పుడు నేను "లేదురా..! అతను ఆరోగ్యంగానే ఉన్నాడు._
*నేను జైలుశిక్ష అనుభవిస్తున్నప్పుడు నా సెల్ సెంట్రీ* ఇతను
 ప్రతిరోజూ నన్ను విపరీతంగా, అకారణంగా కొడుతూ హింసించేవాడు. హింసవల్ల నొప్పులు, బాధతో అరిచీ అరిచీ 
నా గొంతు ఆర్చుకుపోయి _దాహంతో నీళ్లమ్మని అడిగితే,_ 
_హేళనగానవ్వుతూ నామొహం మీద మూత్రం పోసేవాడు._ 
*మాఅమ్మ పాలకన్నా ఇతని మూత్రాన్నే ఎక్కువ తాగాను.* 

*మా అమ్మ ప్రేమను నేర్పితే, ఇతడు ఓపిక నేర్పాడు.* 
_నన్నిప్పుడు ఈ హోదాలో చూసి భయపడి, వణికిపోతున్నాడు._
✨✨✨✨✨✨
 నేను తనమీద ప్రతీకారం 
తీర్చుకుంటానేమో, 
ఉద్యోగం పీకిస్తానేమో, 
జైలులో వేయిస్తానేమో..! 

_ముందే_ఊహించి కొని అలా  భయపడుతున్నాడు._
✨✨✨✨
నా వ్యక్తిత్వం, నా నైతికత అది కాదు!
 పనికిరాని ప్రతీకారం మనుషుల మధ్య.  
 గోడలు కడితే, క్షమ ఒక్కటి చేస్తుంది!
 సౌభ్రాతృత్వం శాంతినిస్తుంది కదా..!" అన్నాను. 

*~నెల్సన్ మండేలా*.

(దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యాక జరిగిన యధార్ధ సంఘటన.)