*_టీచింగ్ అంటే వృత్తి కాదు.... విలువలతో కూడిన జాతి నిర్మాణం.... [ఈ చిన్న కథ విన్నారా....?!]_*
*🌹🙏🌹🙏🌹 🙏 🌹 🙏 🌹*
*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి.... అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లకు మొక్కాడు... మాస్టారూ! బాగున్నారా..?'*
*'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?' 'ఎవరు బాబూ నువ్వు..?* *చూపు సరిగ్గా ఆనడం లేదు... గుర్తుపట్టలేక పోతున్నాను' 'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*
*'ఓహ్, నిజమా..? చాలా సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*
*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?' 'నేను టీచరు అయ్యాను మాస్టారూ...*
*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*
*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే నాకు స్పూర్తి తెలుసా..?'*
*'అదేంటి..? అదెలా..?' 'బహుశా మీకు గుర్తుండదు. ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!*
*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు...* *దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది...*
*ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను...* *కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది... లబోదిబో ఏడ్చాడు...*
*టీచరు కంప్లయింట్ చేశాడు... అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే...*
*ఒరేయ్ పిల్లలూ! ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు... నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది...* *అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా...*
*అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..? కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు...* *ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు... కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.... జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు...*
*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు... అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు...*
*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు. ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించనూ లేదు,* *నలుగురిలో నా ఇజ్జత్ పోకుండా మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర గనక వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో... అలా నన్ను రక్షించారు మీరు...*
*నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్... కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా...* *నా అంతట నేనే మారిపోయేలా చేశారు... ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..?* *ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*
*అప్పుడు ఆ టీచర్ సావధానంగా ఇలా చెప్పాడు... “ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...*
*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*
*(మంచి ఉపాధ్యాయులందరికీ అంకితం...* 🙏)
No comments:
Post a Comment