Sunday, July 31, 2016

స్త్రీలు తప్పనిసరిగా పాటించ వలసిన నియమాలు.....!!



పూర్వం పెద్దలు చెప్పిన వినానివాళ్లు చాలా మంది ఉన్నారు. ఎవరైనా తెలిసిన విషయాలు చెప్పితే మీకు ఏమి తెలియదు ఉరుకోండి అని అంటారు. మీకు ఇంక ఆ చదస్తం పోలేదు అని అంటారు. అయితే కాలనికి అనుగుణంగా మన సంస్కృతి, సంప్రాదాయం కనుమరుగైపోయ్యాయి. మన సంప్రాదాయం ప్రకారం స్త్రీలు కోన్ని పనులు చేయకుడదని శాస్తాలు చెబుతున్నాయి.
అందులో ముఖ్యమైనవి.
a . స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదని, అందువల్ల గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువగా ఉన్నాయాట.
b . గర్భిణి స్త్రీలు శూర టెంకాయ కొట్ట కూడదు. ఎందుకంటె అదురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్థలములో కూడా ఉండకూడదు.
c . మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును. అదే విధంగా మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు.
d . మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను.
e . స్త్రీలు రాత్రి సమయమున గాజులు, కమ్మలు,తాళి తీయరాదు దయ్యాలు ఆవహించే అవకాశం ఉంటుంది.
f . దుఃఖము విచారించ వచ్చిన వారినిని రండి రండి అంది సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు పరోక్షముగా మనము అశుభములను కోరుదోవడానికి ఇది నాంది అవుతుంది.
g . గ్రహణ సమయమందు ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవడానికి కావలసిన ఆమ్లములు తయారు అవవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.
h . నూతన వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమి సమ్హారిణి.
i . నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకండి. ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరిస్తున్నారు. నలుపు వర్ణము వేడిని గ్రహంచుకుని శరీరానికి అందచేస్తుంది. ఉష్ణశరీరం మంచిది కాదు.
j . ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు. వడ్డణ లోకూడా చేతితో ఉప్పు వేయరాదు.
k . ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి మంచింది. ఎందుకంటే ఇది పితృ దేవతలకు కాకి ఇష్టం. మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.
l . కొబ్బరి చిప్పను ఎవరికైనా ఇవ్వవలసి వస్తే మూడు కళ్ళు ఉన్న చిప్ప భాగము ఉంచుకుని అవతలి భాగము ఇవ్వాలి.
m . స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది .
n . శుక్రవారమునాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాశము ఉన్నది.
o .సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు. స్త్రీలు ఒంటి గాజుతో ఉండరాదు.
p . స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు.
q . ఎప్పుడూ తల్లి తమ పిల్లలని చచ్చినోడా అని, దరిద్రుడా అని లాంటి అమంగళకర పదాలు వాడకూడదు.
r .పూలు అమ్మటానికి వచ్చిన వాళ్ళు పూలు కావాలని అడిగినపుడు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటాలే అనో తరవాత తీసుకుంటాలే అనో చెప్పాలి.
s . కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాల్లాడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు, మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ. మర్మావయవాల వద్ద నరాలు వదులు అవుతాయి. దీని వలన మగవారికి నరాలబలహీనత, స్త్రీలకు గర్భము నిలువదు.
వీటిని దృష్టిలో ఉంచుకోని స్త్రీలు నడుచుకుంటే ఎంతో మంచిదని అంటున్నారు.

No comments:

Post a Comment