Sunday, September 4, 2022

Sri Radha

 🎻🌹🙏ఈ రోజు శ్రీ  రాధాష్టమి సందర్భం గా.....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌷భాగవతంలో పెద్దగా చర్చించని రాధాకృష్ణుల గురించి ఏ పురాణం వివరిస్తుంది..?🌷


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


🌿శ్రీకృష్ణుని అష్టమహిషులు ఉండగా ఎన్నో చోట్ల రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం,


🌸 వారి కీర్తనలు బహు ప్రచారంలో ఉండడం, ప్రేమైకస్వరూపంగా వారి గురించి చర్చించడం చూసాము. 


🌿వారి గురించి లోకంలో ఎన్నో దివ్యగాధలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అనవసరమైన తప్పుడుకధలు కూడా చాలా ప్రచారం జరుగుతున్నాయి.


 🌸ఎలాగైతే సూర్యునిగురించి ఎవడో ఏదో తప్పుడు కూతలు కూసినా ఆయన ప్రభావానికి లోటు లేదో, రాధాదేవి గురించి తెలియకపోయినా, తెలివితక్కువ కధలకు విలువ ఇచ్చినా ఆవిడకు వచ్చిన లోటేమీ లేదు.


🌿శ్రీమద్భాగవతం లో చాలా క్లుప్తంగా వివరింపబడిన రాధామాధవుల గురించి ఏ ఏ పురాణాలు ఇతిహాసాలు వర్ణించాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....


🌷1. దేవీభాగవతం :🌷


🌸 నవమ స్కంధంలో గోలోకం గురించి ఎలాగైతే రాధాకృష్ణులు ఏకశక్తికి ప్రకృతి పురుషుల రూపంగా ఉన్నారో వివరిస్తుంది. 


🌿రాధాదేవి శ్రీకృష్ణ ప్రాణాధిక, అలాగే శ్రీకృష్ణుడు లేని రాధ లేదు. వారినుండే బ్రహ్మాండాలు ఉద్భవించినట్టు, ద్విభుజ కృష్ణుని నుండి చతుర్భుజ నారాయణుడు ఎలా ఉద్భావించాడో


🌸 వారినుండి వివిధ బ్రహ్మాండాలు ఎలా విస్తరించాయో, లక్ష్మీ, గంగా, సరస్వతీ, తులసీ ఉద్భవం వంటి వివిధ రోమాంచక ఘట్టాలన్నీ నవమస్కంధం వివరిస్తుంది. 


🌿శ్రీకృష్ణుని శక్తి రాధగా నిలుస్తుంది. రాధాకృష్ణులు వేరు వేరు అని అనుకోవడం వారి మాయకు లోను కావడం. ఆవిడ శ్రీకృష్ణ నిత్యానుపాయిని. 


🌷2. బ్రహ్మవైవర్తన పురాణం: 🌷


🌸ఈ పురాణం సంపూర్ణంగా రాధాకృష్ణుల గురించి చెబుతుంది. బ్రహ్మ, ప్రకృతి, గణేశ, కృష్ణ ఖండాలుగా ఉన్న ఈ పురాణంలో సగభాగం కృష్ణ ఖండం. 


🌿ఈ పురాణం అంతా రాధాదేవి తత్త్వం గురించి, రాధామాధవులను అర్ధనారీశ్వర తత్త్వంలో వివరిస్తుంది. 


🌸ఈ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడే పరబ్రహ్మ, రాధమ్మే పరబ్రహ్మమహిషి. దుర్గ, లక్ష్మి, సరస్వతి ఇత్యాది ప్రకృతి రూపాలన్నీ కూడా రాధ నుండి ఉద్భవించినవే. 


🌿స్త్రీతత్త్వాన్ని ఎవరైనా అవమానిస్తే రాధను అవమానించినట్టు అని చెబుతుంది ఈ పురాణం.


🌸 చైతన్యమహాప్రభు ఇత్యాది భక్తి రస వేదాంతులకు పరమ ఉత్కృష్టమైనది ఈ బ్రహ్మవైవర్తన పురాణం.


🌿 శ్రీకృష్ణ లీలలు, రాధాకృష్ణుల రాసలీలలు, వ్రజభూమి లో వారి ఆటపాటలు వంటి ఎన్నో


🌸 శ్రీకృష్ణ మానవావతార ప్రధాన ఘట్టాలన్నీ విపులంగా వివరింపబడ్డాయి.

 అమ్మవారి చైతన్య తత్త్వం గురించి ప్రకృతి ఖండం విస్తారంగా చెబుతుంది. 


🌷3. బ్రహ్మాండ పురాణం:🌷


🌿 ఉపోద్ఘాతపర్వంలో పరశురాముడు గజాననుని దంతం తన పరశువుతో ఖండించినప్పుడు పార్వతి దేవిని శాంతపరచడానికి రాధాసహిత కృష్ణుడు ప్రత్యక్షమై 


🌸తన సహోదరిని ఊరడింప చేస్తాడు. అప్పుడు పార్వతీ అమ్మవారు వారిని చేసిన స్తోత్రం గృహేరాధే వనే రాధే జగత్ప్రసిద్ధం


🌷4. స్కాందపురాణం: 🌷


🌿వైష్ణవఖండంలో భాగవతమహాత్మ్యం వర్ణనలోను, వాసుదేవ మహాత్మ్యంలోను శ్రీకృష్ణుని ఆత్మ గా రాధమ్మను కీర్తిస్తారు.


🌸 దీనిలోనే గోలోక ప్రాశస్త్యం, నారదునికి రాధాకృష్ణుల దర్శనభాగ్యం వంటి ఎన్నో ఘట్టాలు వివరింపబడి ఉన్నాయి. 


🌷5. నారదపురాణం: 🌷


🌿నారదుడు యుగళ సహస్రనామం చేసినప్పుడు మొదటి 500 నామాలు కృష్ణుని కీర్తిస్తే తదుపరి ఐదు వందల నామాలు రాధా కీర్తన.


🌸 అమ్మవారి తత్త్వం అర్ధం చేసుకోవడం కోసం నారదుడు బృందావనంలో ఒక గోపికగా అవతరించి రాధమ్మ పార్శదునిగా ఆత్మానందం అనుభవిస్తాడు. 


🌷6. పద్మపురాణం: 🌷


🌿భూమిఖండంలో రాధాష్టమి, రాధాదామోదర వ్రతం విశేషాలు విస్తారంగా వివరింపబడి ఉంటాయి.


🌸 పాతాళఖండంలో రాధామాధవుల రాసలీల, వారి పరబ్రహ్మ నిరూపణ, గోలోకంలో వారి లీలలు, నందవ్రజంలో వారు చేసిన అధ్బుత విన్యాసాలు,


🌿 అర్జునుని అభ్యర్ధన మేరకు అర్జునుని అర్జుని అని పేరు గల గోపికగా మార్చి పరబ్రహ్మ ప్రకృతీ పురుషుల దర్శనం ఇవ్వడం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. 


🌷7. విష్ణుపురాణం : 🌷


🌸13వ సర్గలో రాసలీల వివరణ రాధ యొక్క గొప్పదనం వంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి.


🌷8. గర్గ సంహిత:🌷


 🌿దీనిలో రాధాకృష్ణుల రాసలీలలు, వారి దివ్యప్రబోధాలు, బృందావనంలో వారి ఆటపాటలు,


🌸 అటుపై రాధ విరహవేదన, మరల సిద్ద్దాశ్రమంలో వారి కలయిక వంటి అద్భుత లీలలు వర్ణింపబడి ఉన్నాయి.


🌿ఇవి కాక మత్స్యపురాణం లో బృందావనంలో రాధ ఉన్న అమ్మవారికి నమస్సులు అని స్తోత్రం, 


🌸ఋగ్వేదంలో రాధాసంహితలోను, అథర్వణ వేదంలో రాధాతపనీయ ఉపనిషత్తులో రాధా స్తోత్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. 


🌿ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాధాకృష్ణుల తత్త్వం తెలుసుకునే భాగ్యం కలగదని అప్పటికి కానీ వారికి ఆ లీలలు అనుభవించి


🌸 శ్యామసముద్రంలో (అంటే కృష్ణునిలో అంటే మోక్షం ) కలిసే అవకాశం ఉండదని పురాణం చెబుతుంది.


 🌿అటువంటి ఎంతో ఉత్కృష్టమైన తత్త్వం రాధ తత్త్వం. వారి పాపరాశిని దగ్ధం చేసే అవకాశం వీరి చరితం తెలుసుకోవడం.🌸అదే వారి పాపరాశి పోగుచేసుకునేవాళ్ళు వీరి మీద అనవసరపు పైత్యాన్ని ప్రకటించుకుంటూ తమను తాము అధఃపాతాళానికి తీసుకుపోతూ ఉంటారు...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, September 3, 2022

Qualities of Shrimati Radharani

 Qualities of Shrimati Radharani


   As explained in Bhakti-rasamrta-sindhu (Nectar of Devotion), Krishna possesses sixty-four transcendental qualities. Shrimati Radharani has twenty-five transcendental qualities, but She can control even Krishna by them. Her transcendental qualities are as follows: 

   1) She is sweetness personified; 

   2) She is a fresh young girl; 

   3) Her eyes are always moving; 

   4) She is always brightly smiling; 

   5) She possesses all auspicious marks on Her body; 

   6) She can agitate Krishna by the flavor of Her person; 

   7) She is expert in the art of singing; 

   8) She can speak very nicely and sweetly; 

   9) She is expert in presenting feminine attractions; 

   10) She is modest and gentle; 

   11) She is always very merciful; 

   12) She is transcendentally cunning; 

   13) She knows how to dress nicely; 

   14) She is always shy; 

   15) She is always respectful; 

   16) She is always patient; 

   17) She is very grave; 

   18) She is enjoyed by Krishna; 

   19) She is always situated on the highest devotional platform; 

   20) She is the abode of love of the residents of Gokula; 

   21) She can give shelter to all kinds of devotees; 

   22) She is always affectionate to superiors and inferiors; 

   23) She is always obliged by the dealings of Her associates, 

   24) She is the greatest amongst Krishna’s girl friends; 

   25) She always keeps Krishna under Her control.

   Krishna means ‘all attractive’, since He attracts every one to Him. But Shrimati Radharani attracts even Krishna. Although Krishna says vedaham samatitani – “I know everything” – He fails to understand Radharani. Krishna is acyuta (inconceivable), but for Him Radharani is inconceivable. Radharani is so great. Krishna thought, “I am full. I am complete in every respect, but still I want to understand Radharani.” This question obliged Krishna to accept the propensities of Radharani to understand Himself. So five hundred years ago Krishna appeared as Chaitanya Mahaprabhu, in the mood of Shrimati Radharani and with Her golden complexion, as His own greatest devotee. Krishna did this to understand the depth of devotion of Shrimati Radharani.

Friday, September 2, 2022

I - Who are You? If not me - నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 

 ఆశ్చర్య చకితుడయ్యాడు. 


'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను  రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 


 


 సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**మరింత ముందుకు వెళితే 

త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 

తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు  ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.


పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి. 


ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .

అందువల్ల 


* నేను లేకపోతే ఏమవుతుందో* 


అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. 


*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో 

అతి చిన్నవాడను* 


అని   ఎఱుక       కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

Vinayaka Chavithi

 సేకరణ.


దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు 

80 వేల కోట్లు అయిందని గగ్గోలుపెడుతున్న 

కొన్ని సంఘాలు ! 

-------------------------'


అదేమరి మా గొప్పతనం. 

ఇప్పటికైనా తెలిసిందా 

హిందువుల పండుగల విలువ!

ఈ పండగ వల్ల వివిధ కులవృత్తులవారికి అందరికీ 

ఈ 80 వేల కోట్ల రూపాయల డబ్బు వారివారి ఇండ్లకు చేరింది. 


వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, 

వారి సహాయకులైన, 

వారికి, మట్టి అందించే వారికి, 

రంగులు అమ్మేవారికి, రంగులు వేసే వారికి..

మేదర సోదరులు తాటాకు/ వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మంటపాలు ద్వారా మరియు 

షామియానా వారు వేసే టెంట్లు ద్వారా 

వారికి వారికి ఉపాధి దొరికింది.


సన్నాయి, బ్యాండ్ మేళం వారికి, లోపల డెకరేషన్ చేసే వారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్లకు పని దొరికింది.


పువ్వుల పంటల వారికి, కోసే వారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి... దండలు, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా 

అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి.


ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి 

విగ్రహాలు మంటపాలకు తేవటానికి,

మరల నిమజ్జనానికి తీసుకు వెళ్ళటానికి

అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి.


దాదాపు ప్రతి మంటపం లో అన్నదానాలు జరుగుతాయి. 

కలిసి భోజనాలు జరుగుతాయి.. 

సమాజంలో సామరస్యత పెరుగుతుంది. 

ప్రతి ఒక్కరూ కడుపునిండా తినగల్గుతారు.. 


వంట మనుషులకు, సహాయకులకు, 

టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది.


వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే 

వారికి మంచి ధర కు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు.


బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన దక్కుతుంది. 

ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది.


కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజచేసే పత్రి, మామిడాకులు... ఇలా వీటిన్నటినీ

ఈ రోజుల్లో కొనటమే కనుక సన్నకారు రైతులు అందరూ

వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది.


హరికధలు, బుర్రకధలు, నాటకాలు, ప్రవచనాలు,

భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు,

ఊరేగింపులలో కోయడాన్సులు, భేతాళ నృత్యాలు, కోలాటాలు,

తీన్మారులు, తాసాలు రామడోళ్లు, నాదస్వర డోలు, షెహనాయిలు,

చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు

ఈ వినాయకచవితి పేరుచెప్పకుని తనకుటుంబంతో కలసి

తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే.


ఆఖరికి కూలి పనికి వెళ్లేవారు కూడా

నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, 

షెడ్ లకు రాడ్ లు ఎత్తే పనికో,

పైన ఆకులు వేసే, రేకులు వేసే పనికో, పోతే 

నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది

కూడా ఈవినాయకచవితి కోసమే.


నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపాల నుంచే అంటే అతిశయోక్తి కాదు.


ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం , ప్రజలలో ఐకమత్యం తీసుకురావటానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశ పెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంత మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే మాకు చాలా గర్వంగా ఉంది. 


నేడు గణేశ నవరాత్రులు కు అనుమతులు తీసుకోవటం అంటే ఆత్మ గౌరవం కల్పించలేని రాజ్యంలో ఉన్నామనే భావన కలుగుతుంది.


ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే ... మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో 

ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్ధంకాదు.

మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన, లోతైన రహస్యాలు వీరికి ఎన్నటికీ అర్థం కావు.

 

ప్రతి పండుగ మనకు ఒక్కో మేలును కల్గిస్తూ, 

ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. 

ప్రతి ఒక్క కులమూ గొప్పదే .. 

ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు. 

*గమనిక:- కులం అంటే వృత్తి.* 


భక్తి పేరుతో వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం అనే సిద్దాంతం దాగి ఉంది.


అర్థం కాని వారు ఒక ఏడాది పాటు వెయిట్ చేసి, ఒకే ఒక్క పండగ జరుపుకుంటూ ఆర్థిక మాంద్యం బారిన పడే వివిధ దేశాల 

ఆర్థిక విధానాల మీద పరిశోధన చేసి చూస్తే 

ఇక వారు మన పండగల జోలికి రారు. 


చివరిగా ఒకమాట....


మన పండుగలలో ధనం ధర్మబద్దంగా చందాల రూపంలో సేకరించి 

అందరికీ పంచబడుతుంది.


మాకు దోపిడీ చేసి ధనాన్ని పంచే రాబిన్ హుడ్ ల అవసరం పడదు! 


మాకు మేము పని కల్పించుకుని 

సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మంమాది.


జై భారత్🇮🇳 ఇది ఆచారం,

Monday, April 25, 2022

Sex life

 Sex life is meant only for begetting Krsna conscious children


Another significant point of this verse is that one has to observe the prescribed rules and regulations. As confirmed in Bhagavad-gita, yuktahara-viharasya. When one engages in devotional service in Krsna consciousness, he still has to eat, sleep, defend and mate because these are necessities of the body. But he performs such activities in a regulated way. He has to eat krsna-prasada. He has to sleep according to regulated principles. The principle is to reduce the duration of sleep and to reduce eating, taking only what is needed to keep the body fit. In short, the goal is spiritual advancement, not sense gratification. Similarly, sex life must be reduced. Sex life is meant only for begetting Krsna conscious children. Otherwise, there is no necessity for sex life. Nothing is prohibited, but everything is made yukta, regulated, with the higher purpose always in mind. By following all these rules and regulations of living, one becomes purified, and all misconceptions due to ignorance become nil. It is specifically mentioned here that the causes of material entanglement are completely vanquished.


Srila Prabhupada — SB 3.33.26, purport

Friday, April 22, 2022

Atheism comes from Upanishad 😀

 There are Six Schools of Hindu Philosophy:-


SANKHYA PHILOSOPHY :


Dualistic


Has two entities- Purush (spirit) and Prakriti (nature).


The necessity of God is not felt for epistemological clarity about the interrelationship between the higher self. individual self and surrounding universe.


YOGA PHILOSOPHY :


Does not require belief in God, although such a belief is accepted as help initial stage of control of mind, concentration and meditation.


NYAYA PHILOSOPHY :


States that nothing is acceptable unless it is in accordance with reason and experience (scientific reasons and experiments).


Says “the world is real” and it relies on pramanas (evidences).


VAISHESHIK PHILOSOPHY :


Realistic and objective philosophy of the universe.


MIMANSA (PURVA MIMANSA) :


Lays emphasis on the performance of Yagya (or yajna) for attaining spiritual and worldly benefits.


VEDANTA (UTTARA MIMANSA) :


Monistic


States that the world is unreal (maya).

So it can clearly be seen that Vedas include almost all kinds of belief systems people can have. Here Nyaya and Vaisheshik philosophies are nothing but atheism only (because the existence of God or a supernatural power cannot ever be established through reasons, logic and realistic experiments).


But since Vedas are the “oldest scriptures of Hinduism”, they established Hinduism as a philosophy (a way of life) in which people were allowed to have different kinds of beliefs and they were all accepted as a part of Hinduism. There was also nothing like punishing or hating atheists.


An important Hindu Atheist School of Thought: LOKAYATA SCHOOL OF THOUGHT


Lokayata School of thought believes in the reality of this world and the physical existence of man and other beings on earth and nothing else. Loka means world and Lokayata means the person who is centred upon this world only. Lokayats do not believe in God, heaven or hell. Thus although they are atheists, but a part of Hinduism.


In this sense, one can well be an atheist and a hindu at the same time. Hindu atheists accept Hinduism as a “way of life” than a religion.

Monday, April 11, 2022

Teacher n Teaching

 *_టీచింగ్ అంటే వృత్తి కాదు.... విలువలతో కూడిన జాతి నిర్మాణం.... [ఈ చిన్న కథ విన్నారా....?!]_*

*🌹🙏🌹🙏🌹 🙏 🌹 🙏 🌹*

*ఎండ... చెమట... ఈసురోమంటూ నడుస్తున్నాడు ఓ పెద్దమనిషి.... అనుకోకుండా ఓ యువకుడు ఎదురయ్యాడు... పలకరించాడు... వంగి, కాళ్లకు మొక్కాడు... మాస్టారూ! బాగున్నారా..?'*

*'సర్, నన్ను గుర్తుపట్టలేదా..?' 'ఎవరు బాబూ నువ్వు..?* *చూపు సరిగ్గా ఆనడం లేదు... గుర్తుపట్టలేక పోతున్నాను' 'సర్, నేను మీ ఓల్డ్ స్టూడెంట్ ను..'*

*'ఓహ్, నిజమా..? చాలా సంతోషం, నాకు గుర్తు రావడం లేదు, ఏం చేస్తున్నావ్ బాబూ ఇప్పుడు..?*

*అంటే, బతకడానికి ఏం చేస్తున్నావ్ అని..?' 'నేను టీచరు అయ్యాను మాస్టారూ...*

*'గుడ్, వెరీ గుడ్, నాలాగే టీచర్ అయ్యావన్నమాట..?'*

*'అవును సర్, నిజానికి టీచర్ కావడానికి మీరే నాకు స్పూర్తి తెలుసా..?'*

*'అదేంటి..? అదెలా..?' 'బహుశా మీకు గుర్తుండదు. ఓరోజు జరిగిన సంఘటన, నేను చెబుతాను, వినండి..!*


*“ఓసారి నా ఫ్రెండ్ ఒకడు మంచి ఖరీదైన, మోడరన్ వాచీ తెచ్చుకున్నాడు...* *దాన్ని చూడగానే నాలో దొంగ బుద్ధి ప్రవేశించింది, చేతులు పీకేస్తున్నయ్, మనసు లాగేస్తోంది...*

*ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాను, వాడి జేబులో నుంచి లాఘవంగా దొంగతనం చేశాను...* *కాసేపటికి వాడికి తన వాచీ పోయిందని తెలిసొచ్చింది... లబోదిబో ఏడ్చాడు...*

*టీచరు కంప్లయింట్ చేశాడు... అప్పుడు ఆ క్లాస్ టీచర్ మీరే...*

*ఒరేయ్ పిల్లలూ! ఇది మంచి పని కాదు, ఎవరు వాడి వాచీ తీశారో తిరిగి ఇచ్చేయండి, నేను క్షమిస్తాను, ఎవరినీ ఏమీ శిక్షించను అన్నారు మీరు... నేనేమీ భయపడలేదు, నాకు ఇవ్వాలని లేదు, ఇవ్వడం కోసమా చోరీ చేసింది...* *అందుకే తిరిగి వాచీ ఇవ్వలేదు, ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉంటే కదా...*

*అప్పుడు మీరేం చేశారో గుర్తుందా మీకు..? కిటికీలు, తలుపులు మూసేశారు, అందరినీ ఓ సర్కిల్ గా నిలబెట్టారు...* *ప్రతి ఒక్కరి జేబు చెక్ చేస్తానన్నారు... కాకపోతే అందరినీ కళ్లు మూసుకోవాలని చెప్పారు.... జేబుల చెకింగ్ అయిపోయేవరకు కళ్లు తెరవొద్దని గట్టిగా హెచ్చరించారు...*


*తప్పదు కదా మరి, మీరు ఒక్కొక్కరి జేబూ చెక్ చేస్తూ వెళ్లారు, నా జేబులో దొరికింది మీకు, తీసుకున్నారు, అడ్డగోలుగా దొరికిపోయాను అనుకున్నాను, కానీ ఆ తరువాత కూడా మిగతా అందరి జేబులూ చెక్ చేశారు... అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు...*

*అన్ని జేబుల తనిఖీలు పూర్తయిపోయాక... వాచీ దొరికింది, కళ్లు తెరవండి అన్నారు మీరు. ఫలానా వారి జేబులో దొరికిందని మీరు చెప్పలేదు, నన్ను పట్టుకుని నాలుగు తగిలించనూ లేదు,* *నలుగురిలో నా ఇజ్జత్ పోకుండా మీరు కాపాడారు, అది తరువాత అర్థమైంది... ఒకసారి నాపై మీరు ఆరోజే దొంగ అనే ముద్ర గనక వేసి ఉంటే, నిజంగానే దొంగగా మారిపోయి ఉండేవాడినేమో... అలా నన్ను రక్షించారు మీరు...*

*నాలో ఓ మార్పు తెచ్చింది ఆనాటి ఎపిసోడ్... కనీసం మీరు పక్కకు తీసుకుపోయి నన్ను మందలించలేదు కూడా...* *నా అంతట నేనే మారిపోయేలా చేశారు... ఇప్పుడు గుర్తొచ్చిందా సర్..? కానీ నా దగ్గర వాచీ దొరికాక కూడా, నన్నెందుకు మందలించలేదు..?* *ఇప్పటికీ జవాబు దొరకని ప్రశ్న సర్, ఇప్పుడైనా చెప్పరా ప్లీజ్...”*


*అప్పుడు ఆ టీచర్ సావధానంగా ఇలా చెప్పాడు... “ఒరేయ్, అందరి జేబులూ చెక్ చేశాను... నీ దగ్గర వాచీ దొరికాక నీ మొహం చూసి, నిన్ను మందలిస్తే, ఇక నిన్ను చూసినప్పుడల్లా వీడు దొంగ అనేదే గుర్తొస్తుంది నాకు, ఫలితంగా బోధనలో వివక్షకు, నీపట్ల నా ప్రవర్తనలో తేడాకు కారణం కావొచ్చు...*

*అందుకేరా అబ్బాయ్, నేను కూడా ఫలానా వాళ్ళ దగ్గర వాచీ దొరికింది అనే సంగతి నాకే తెలియకుండా ఉండటం కోసం.... నేను కూడా కళ్లు మూసుకునే అందరి జేబులూ చెక్ చేశాను...”*

*(మంచి ఉపాధ్యాయులందరికీ అంకితం...* 🙏)