Tuesday, September 28, 2021

Best Sales Man of the Year

 ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.


అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.

 "ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.


 "చెయ్యలేదు"

 

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".


తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు. 


"ఈ రోజు ఎంత మంది custermurs కి  సేల్స్ చేశావు?".


 "సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.


 "ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"


 "8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్. 


"వాట్ !!" అదిరిపడ్డాడు  బాస్. 


"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?"  అడిగాడు. 


"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."


"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? "  అన్నాడు బాస్.         


"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.” 


బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"


 "లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.


"మరి ? "  అన్నాడు బాస్. 


 " ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను." 


బాస్: " అరే యార్ …!! ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"


అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "

చైతన్య -నారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 

ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్  పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃

Saturday, July 31, 2021

Breathing - శ్వాస విజ్ఞానము

 శ్వాస విజ్ఞానము:-


 శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము.  ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము.  కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.


❇️ శ్వాస - సోహం:-

మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును.  'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది.  ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.


 శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో,  అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము.  ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని,  ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.


❇️ శ్వాస - ఆయుష్షు:-

ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు.  సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు.  కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.

➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.

➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది. 

➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.

➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.


❇️ శ్వాస - నాడులు:-

మన శరీరములో 272000 నాడులున్నాయి.  నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు,  నరములు కావు.  ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..


1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు

2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు

3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు

4. గాంధారి నాడి - కుడి నేత్రం

5. అస్తిని నాడి - ఎడమ నేత్రం

6. పూష నాడి - కుడి చెవి

7. యశస్విని నాడి - ఎడమ చెవి

8. ఆలంబన నాడి - నోరు

9. లకుహా నాడి - శిశ్నము

10. శంభని నాడి - గుదము


మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు  పోవును.


 వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు

2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు

3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు

  మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది.  ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.

 సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు,  చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం.  కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.

 స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది.,  అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.


❇️ శ్వాస - పంచప్రాణాలు:-

శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.


1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.


❇️ శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.


❇️ శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.


❇️ శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.


❇️ శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

Thursday, July 8, 2021

Pothana ammala ganna yamma

 🙏🌺 బెజవాడ ఆలయంలో రాజద్వారం పై ఉండే

ఈ పద్యం గురించి మీకు తెలుసా🌺🙏

🌺అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ* *దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్🌺

🌺విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు *కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాలనే ఇచ్చేస్తాయి

ఎందుకు అంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. అది మనవల్ల కాదు. మీరు బీజాక్షరములను ఉపాసన చెయ్యలేరు. అది కష్టం. 

కానీ పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.🌺

🌺అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. 

అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడాని కని ఇటువంటి ప్రయోగం చేశారు🌺

🌺అమ్మలగన్నయమ్మ’ – అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపం. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.🌺

🌺సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.🌺

🌺ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.🌺

🌺అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రేనమః’...మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా – అమ్మల

Sri sri

 *శ్రీశ్రీ చమక్కులు*


శ్రీశ్రీ  గారు, మీరెప్పుడైనా బట్ట తల మీద కవిత్వం రాశారా ? (రాళ్లబండి కుటుంబ రావు) 
లేదండి !! నేనెప్పుడూ కాగితం మీదే రాస్తాను (శ్రీశ్రీ) 

అట్లు చెప్పనా? (హోటల్ లో స్నేహితుడు)
అట్లే కానిమ్ము (శ్రీశ్రీ)

మీరు నాకు ఓ నాటిక రాసి పెట్టాలి (వల్లమ్ నరసింహా రావు)
ఏ నాటికైనా రాస్తాను మిత్రమా (శ్రీశ్రీ)

కొచ్చిన్ సిస్టర్స్ కవర్ పేజీ గా వేద్దామా (పత్రికా సంపాదకుడు)
ఎందుకొచ్చిన సిస్టర్స్ (శ్రీశ్రీ)

చలం గారు రాసిన యోగ్యతా పత్రం చదివితే ఇకే మహా ప్రస్తానం చదవక్కర లేదంటాను, మీరేమంటారు (పిచ్చి రెడ్డి)
మీరు సార్ధక నామధేయులంటాను (శ్రీశ్రీ)

మీ శిష్యరత్నమైన ఆరుద్ర మీద మీ అభిప్రాయం ఏమిటి (విలేఖరి )
నా శిష్యుడంటే అతనొప్పుకోడు. అతగాడు రత్నమంటే నేనొప్పుకోను (శ్రీశ్రీ)

ఇక్కడ వేడి తేనీరు దొరుకును (హోటల్ ముందు బోర్డు)
అరే!! ఇక్కడ వెడితే కానీ నీరు దొరకదా (శ్రీశ్రీ)

కుక్కలున్నవి జాగ్రత్త (ఓ ఇంటి ముందు బోర్డు)
అరే !! ఇంతకు ముందు ఇక్కడ మనుషులు ఉండేవారే (శ్రీశ్రీ)

కవులు హాలికులైతేనేమి అన్నారు పోతన, ఆల్కహాలికులైతే నేమి అంటాడు శ్రీశ్రీ

మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే. సీసా లేబిల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే ...సిరిసిరిమువ్వా (శ్రీశ్రీ)

టైంకు రావడం శాస్త్రీయం, టైంకు రాకపోవడం కృష్ణ శాస్త్రీయం (శ్రీశ్రీ)

ఉగ్గేలా త్రాగుబోతుకు, ముగ్గేలా తాజమహల్ మునివాకిట్లో. విగ్గేలా కృష్ణ శాస్త్రి కి, సిగ్గేలా భావ కవికి సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్, పళ్లూడిన ముదుసలి కుచ్చిళ్ళను సవరించినట్లు సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)

అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, కరవక మొరిగే కుక్కలు తరమవు, అరవక కరిచే కుక్కలు మరలవు, అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు (శ్రీశ్రీ)

ఇస్పేటు జాకీలం, ఎగేసిన బాకీలం, మృత్యువు సినిమా లో మూడు బాషల టాకీలం, భగవంతుని టోపీలం, కవిత్రయపు కాపీలం, గోరంతలు కొండంతలం (శ్రీశ్రీ)

Wednesday, June 30, 2021

Bhagavadgita 9.22

 ఒక్కోసారి దేవుడు ఇంగ్లాండు నుండీ కూడా వస్తాడు ! 


కొన్నేళ్ళ క్రితం మన దేశంలో [ ఉత్తరభారతం] ఒక ఆయుర్వేదవైద్యుడు వుండేవారు. పేద డాక్టరు .  భగవద్గీత లో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూవుండేవాడు. ఒకరోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. [ నన్ను నమ్మి ,  అహంకారం వదలి , నాకు శరణాగతి చేసుకొన్న వారి బాగోగులు నేనే చూసుకొంటాను - అనన్యాశ్చింతయోమా  ...యోగక్షేమం వహామ్యహం - 9 వ అధ్యాయం , 22 వ శ్లోకం] ] ఉదాహరణకు రోజుకు 80 రూ. కావాలి. ఎనిమిదిమంది పేషెంట్లు వచ్చారు , 80 రూ. వచ్చింది. అంతే . తొమ్మిదవ పేషెంటు దగ్గర డబ్బు తీసుకోడు. ఉచితం. ఎప్పుడూ దైవ చింతనలో వుండేవాడు.ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాల్నో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకొని ఆస్పత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు  [ ఫీజు రూపంలో ] రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా ? అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా ? వాసుదేవమితి సర్వం .      


ఒక రోజు ఆసుపత్రి [ చిన్న గది] ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి , డాక్టరు దగ్గరికొచ్చి ' నన్ను గుర్తుపట్టారా ? '' అని అడిగాడు. '' క్షమించాలి , లేదు , '' అన్నాడు డాక్టరు. అపుడు ఆయన ఇలా చెప్పాడు : '' 15 ఏళ్ళ క్రితం ఒక రాత్రి ఈ వూరిగుండా వెళుతున్న నేను , ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవర్ కారు రిపేరు చేస్తున్నాడు. అపుడు మీరు వచ్చి ' లోపలికి రండి ' అన్నారు. గదిలోకొచ్చి కూర్చొన్న నన్ను చూసి ' మీరు ఏదో దిగులు పడుతున్నారు , ఆరోగ్యం సరిగాలేదా ? ' అన్నారు. అపుడు మీ టేబిల్ దగ్గర సుమారుగా ఆరేళ్ళు వుండే ఒక చిన్న పాప మిమ్మల్ని ' నాన్నా , ఇక ఇంటికి వెళదాం , రండి ' అని పిలిచింది. ' కాసేపు ఆగమ్మా , కారు వెళ్ళాక మనం ఇంటికివెళదాం ,' అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను ' , నేను ఇంగ్లాండులో వుంటాను. మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప వుండాలని మాకు ఎంతో కోరిక , కానీ తీరలేదు. ఇపుడు ఈ పాపను చూస్తే , నా బాధ  గుర్తుకొచ్చింది ,'' అన్నాను. మీరు రెండు పొట్లాల ఔషధం తయారుచేసి ' మీరు , మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున  తీసుకోండి 'అన్నారు.  నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి ?  అని అడుగుతుంటే అపుడు మరో పేషెంటు వచ్చి తన జబ్బు చెప్పి మీదగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ , నాదగ్గరకొచ్చి ' ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో , ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు ' అని అంటూ  వెళ్ళిపోయాడు. కారు రిపేరు అయ్యింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. దిల్లీ వెళ్ళి అక్కడినుండి ఇంగ్లాండు వెళ్ళాం. ఇంగ్లాండు డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తరువాత కూడా , మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం ,వృత్తిపట్ల మీ అంకిత భావం , మీ వ్యక్తిత్వం చూసాక నమ్మకం కలిగి నేను , రాధిక ఔషధం తీసుకొన్నాం. ఇపుడు మాకు ఇద్దరు ఆడపిల్లలు. పుత్తడిబొమ్మల్లావుంటారు. మీరు మాకు దేవుడితో సమానం. 


అప్పటినుండీ మీ ఋణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్ లో ఒక అక్కగారు వున్నారు . దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డుప్రమాదం లో మరణించారు. వాళ్ళకో కూతురు. ఆమె పెళ్ళి బాధ్యత నేనే తీసుకొన్నాను. అపుడు నాకు 15 ఏళ్ళక్రితం ఈగదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇపుడు పెళ్ళి వయసుకు వచ్చివుంటుంది. ఆమె పెళ్ళికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈనెల 24 న మా అక్క కూతురి  పెళ్ళి . మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్దతిలో లెక్కవేసి ఈడబ్బు తెచ్చాను.మీరు డబ్బు కోసం ఎవరిదగ్గరా అప్పు చేయకండి. నేనున్నాను.ఇది మీరు తీసుకోవాలి '' అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబిల్ మీద పెట్టాడు.  అపుడు డాక్టరు తన జేబులోంచి ఈ రోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆరోజు ఉదయం వ్రాసి ఇచ్చిన అవసరాల లిస్టు ను అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసివుంది : ' ఈనెల 22 న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర వంద రూపాయలు కూడా లేవు. ఆలోచించండి.' 


అనన్యాశ్చింతయోమా....యోగక్షేమం వహామ్యహం

Monday, June 14, 2021

Read Books

 📗📙📕📘📔📘📕📙📗

*పుస్తకాలను చదవడానికి  కారణాలు*
📗📙📕📘📔📘📕📙📗
1. పుస్తకాలు  "ఆత్మవిశ్వాసం" పెంచటానికి  సహాయపడతాయి.

2. పుస్తకాలు ప్రపంచాన్ని మీ "ముంగింట" ఉంచుతాయి.

 3. పుస్తకాలు  మీ "వ్యక్తిత్వాన్ని"  అభివృద్ధి చేస్తాయి.

4. పుస్తకాలు "ఆలోచన సరళి"  పెంచుతాయి..

5. పుస్తకాలు  మిమ్ములను" నవ్విoప " చేస్తాయి.

6. పుస్తకాలు  మిమ్మల్లి "పరిపూర్ణత"  వైపు ఆకర్షిస్తాయి.

7. పుస్తకాలు మీలోని "సృజనాత్మకత" ను ప్రేరేపిస్తాయి.

8. పుస్తకాలు మీ "రచనా ప్రతిభ" ను వేలికితీస్తాయి.

9. పుస్తకాలు "కమ్యూనికేట్" చేయడానికి సహాయపడతాయి.

10. పుస్తకాలు మీ "దృష్టిని"  అర్ధవంతం చేస్తాయి.

11. పుస్తకాలు మీ "ఉత్సుకత" ను సంతృప్తిపరుస్తాయి.

12. మరిన్ని "ఎంపికలు" చేయడానికి పుస్తకాలు మీకు సహాయపడతాయి.

13. "సాహిత్య ప్రతిభ" ను  పెంపొందించడానికి పుస్తకాలు సహాయపడతాయి.

14. పుస్తకాలకు చదవడానికి" ప్రత్యేక పరికరం"  అవసరం లేదు.

15. పుస్తకాలు మీ" "దూర దృష్టిని" పెంచుతాయి.

16. పుస్తకాలు "ఫలవంతమైన" కాలక్షేపం.

17. పుస్తకాలను ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

18. ఇతరులు విఫలమైనప్పుడు పుస్తకాలు వినోదాన్ని అందిస్తాయి.

19. పుస్తకాలు మిమ్మల్ని" శక్తివంతం" చేస్తాయి.

20. ప్రతిదాన్ని "తెలుసుకోవడానికి" పుస్తకాలు సహాయపడతాయి.

21. సరదాగా నవ్వు కొంటానికి, మరియు సృష్టించడానికి మరియు వ్యాప్తి చేయడానికి పుస్తకాలు సహాయపడతాయి.

22. ప్రయాణo లో పుస్తకాలు,  సహాయపడతాయి.  మీ ఆలోచనలను కట్టడి చేస్తాయి.

23. వాస్తవాలు మరియు "గణాంకాలతో" పుస్తకాలు మిమ్మల్ని నవీకరిస్తాయి.

24. పుస్తకాలు ప్రేమ, ఆప్యాయత మరియు "జ్ఞానాన్ని " వ్యాప్తి చేస్తాయి.

25. పుస్తకాలు" మంచి స్నేహితులు" గా తో డు, ఉన్నట్లు  "చేస్తాయి.

26. పుస్తకాలు మిమ్మల్ని "మేధోమథనం" వాతావరణానికి తీసుకెళతాయి.

27. మీ చుట్టూ ఉన్న "ప్రపంచాన్ని" అనుభవించడానికి పుస్తకాలు మీకు సహాయపడతాయి.

28. పుస్తకాలు మీ "మనస్సు" ను అలరిస్తాయి.

29. పుస్తకాలు మీ "ఆలోచన పరిధి" ని విస్తృతం చేస్తాయి.

30. పుస్తకాలు "ప్రకృతిని"  మీ సమీపానికి కి తీసుకువస్తాయి.

31. పుస్తకాలు 'వ్యక్తిత్వ మార్పు'ను తెస్తాయి.

32. పుస్తకాలు "గ్రహణశక్తి" ని పెంచుతాయి.

33. పుస్తకాలకు "సంస్థ" అవసరం లేదు.

34. పుస్తకాలు "ఒత్తిడి" ని  నివారిస్తాయి..

35. పుస్తకాలు మీలో "ఉమ్మడి భావనను" పెంచుతాయి.

36. పుస్తకాలు మానసిక మరియు శారీరక విశ్రాంతిని అందిస్తాయి.

37. పుస్తకాలు "కమ్యూనికేషన్" సాధనంగా పనిచేస్తాయి.

38. పుస్తకాలు చదవడం  మేధోపరమైన సంతృప్తికరమైన చర్య.

39. పుస్తకాలు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.

40. పుస్తకాలు భావోద్వేగ బలాన్ని అందిస్తాయి.

41. పుస్తకాలు మీ "ఆత్మగౌరవాన్ని" పెంచుతాయి.

42. పుస్తకాలు మీ అవగాహను పెంచడానికి సహాయపడతాయి మరియు ప్రోత్సహిస్తాయి.

43. పుస్తకాలు మిమ్మల్ని మరింత తెలివిగా చేస్తాయి.

44. పుస్తకాలు మీరు  ఎదగడానికి సహాయపడతాయి.

45. పుస్తకాలు మిమ్మల్ని 'కలల ప్రపంచానికి' తీసుకెళతాయి.

46. పుస్తకాలు మీ జీవితాన్ని మరియు దృక్పదంను  మార్చగలవు.

47. పుస్తకాలు 'జీవిత లక్ష్యాలను' సాధించడంలో సహాయపడతాయి.

48. పుస్తకాలు అద్భుతమైన అనుభవాన్ని అభివృద్ధి చేస్తాయి.

49. పుస్తకాలు జీవితాలను మారుస్తాయి.

50. "పుస్తకాలు "స్ఫూర్తి" నిస్తాయి, పుస్తకాలు ప్రేరేపిస్తాయి, పుస్తకాలు దేశాలను నిర్మిస్తాయి.

51)" మంచి పుస్తకాలు పరిచయం గత శతాబ్దాలలోని  ఉత్తమ వ్యక్తులను సంభాషించటం వంటిది.

52)" మానవజాతి పురోగమన యాత్రలో పుస్తకాలు మహత్తర పాత్ర పోషిస్తాయి.

53)" మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రులు వెంట లేని లోటు కనిపించదు.

54)" గొప్ప రచయితల సాహిత్యం చదవటం ద్వారా ఉన్నతమైన ఆలోచనలు "మంచి వ్యక్తిత్వం" అలవడతాయి.

55)" ప్రస్తుతానికి సంస్కృత భాషలో 102,70 కోట్ల, 50 లక్షల శబ్దాలు ఉన్నాయి, అటువంటి సంస్కృతం శబ్దాల యొక్క పుస్తకాలు చదివిన, మీ జీవితమే" చరితార్థం" అగును.      

56)" నాసా" వద్ద ప్రస్తుతం 60 వేల తాళపత్ర గ్రంధాలు ఉన్నాయి.  వాటిని కూడా పుస్తక రూపం లో పెట్టిన  పరిశోధనాత్మక పుస్తకాలు వెలువడుతాయి.

57)" మనో వికాసము, వ్యక్తిత్వ వికాసము యొక్క పుస్తకాలు, తెలుగు భాషలో కూడా వచ్చుచున్నవి,  చదివి ఆచరించిన వారికి సరియైన ఫలితములు కనబడును.

58) నేడు" ఆడియో బుక్స్" అమెజాన్ ఆన్లైన్ లో దొరుకుతుంది వాచ్ చేయునప్పుడు  డ్రైవింగ్ లో  మీ జీవితానికి ఉపయోగపడే పుస్తకాలు వినికిడి ద్వారా మీరు మీ సమయాన్ని వృధా కాకుండా చూసుకోండి.

59)" నేడు "హ్యాండ్ రైటింగ్" నేర్చుకొనుటకు,
"బ్రెయిన్ కంట్రోల్" చేసుకొనుటకు, ఆన్లైన్ క్లాస్ లు, తో పాటు పుస్తకములు కూడా కలవు.

60)"స్పెయిన్" దేశంలో లో ప్రతి పుస్తకం కొనుగోలు పై ఒక "గులాబీ గిఫ్ట్" గా ఇస్తారు.

62)" అమెరికాలో వేలకొలదీ ఈ బుక్స్ ను నెట్లో పెట్టి పుస్తకాలమీద స్కూలు పిల్లలకు " "Accelerated Reading Competition " రీడింగ్ కాంపిటేషన్" పెడతారు.

63)" పుస్తకాలు చదివేవారికి, సహనం ఓర్పు ,అభ్యాసం, వినే ఓపిక ఉంటుంది.   "Knowledge" పొందగలడు

64)" పుస్తకాలు చదవాలన్న కోరిక కే కాదు, వీరిది ఒక రకమైన "తీవ్రతపన" ఉంటుంది.

65)"  ఆధ్యాత్మిక గ్రంథముల పఠనము" వల్ల తృప్తి, ఆనందంగా, సంతోషంగా, గౌరవము పొందగలడు. ( జ్ఞాన సంపద వలన)

Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare
📗📙📕📘📔📘📕📙📗

Wednesday, April 21, 2021

Ramayanam questions

 ప్రశ్నల్లో  రామాయణం ..


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి


1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?

= వాల్మీకి.


2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?

= నారదుడు.


3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి , మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?

= తమసా నది.


4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?

= 24,000.


5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?

= కుశలవులు.


6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?

= సరయూ నది.


7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?

= కోసల రాజ్యం.


8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?

= సుమంతుడు.


9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?

= కౌసల్య , సుమిత్ర , కైకేయి.


10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?

= పుత్రకామేష్ఠి.


11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?

= కౌసల్యకు 50% , సుమిత్రకు 25% , కైయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.


12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

= జాంబవంతుడు.


13. వాలి ఎవరి అంశతో జన్మించెను?

= దేవేంద్రుడు.


14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?

= హనుమంతుడు.


15. కౌసల్య కుమారుని పేరేమిటి?

= శ్రీరాముడు.


16. భరతుని తల్లి పేరేమిటి?

= కైకేయి.


17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?

= లక్ష్మణ , శత్రుఘ్నులు - తల్లి సుమిత్ర.


18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?

= వసిష్ఠుడు.


19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?

= 12 సంవత్సరములు.


20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?

= మారీచ , సుబాహులు.


21.  రామునికి అలసట , ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?

= బల - అతిబల.


22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?

= సిద్ధాశ్రమం.


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


శ్రీ సీతా రాములు కళ్యాణం - చాగంటి వారి అద్భుత ప్రవచనం - ఆఖరి భాగం 


https://youtu.be/yO-wqYgZ6-0


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


23. తాటక భర్త పేరేమిటి?

= సుందుడు.


24. తాటకను శపించిన మహర్షి ఎవరు?

= అగస్త్యుడు.


25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?

= భగీరథుడు.


26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?

= జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.


27. అహల్య భర్త ఎవరు?

= గౌతమ మహర్షి.


28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?

= శతానందుడు.


29. సీత ఎవరికి జన్మించెను?

= నాగటి చాలున జనకునికి దొరికెను.


30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?

= దేవరాతుడు.


31. శివధనుస్సును తయారు చేసినదెవరు?

= విశ్వకర్మ.


32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?

= మాండవి , శృతకీర్తి.


33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?

= జనకుడు.


34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?

= కుశధ్వజుడు.


35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?

= వైష్ణవ ధనుస్సు.


36. భరతుని మేనమామ పేరు ఏమిటి?

= యధాజిత్తు.


37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?

= మంధర.


38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?

= గిరివ్రజపురం, మేనమామ యింట.


39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?

= శృంగిబేరపురం.


40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?

= గారచెట్టు.


41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?

= భారద్వాజ ముని.


42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?

= మాల్యవతీ.


43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?

= తైలద్రోణములో.


44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?

= జాబాలి.


45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?

= నందిగ్రామము.


🌻🌻🌻🍂🍂🍂🌻🌻🌻


మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాలకు మన టెలిగ్రాం గ్రూప్


t.me/narayanamantram


🍂🍂🍂🌻🌻🌻🍂🍂🍂


46. అత్రిమహాముని భార్య ఎవరు?

= అనసూయ.


47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?

= విరాధుడు.


48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?

= అగస్త్యుడు.


49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?

= గోదావరి.


50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?

= శూర్ఫణఖ.



🌻🌻🌻🍂🍂🍂🌻🌻🌻