*శ్రీశ్రీ చమక్కులు*
శ్రీశ్రీ గారు, మీరెప్పుడైనా బట్ట తల మీద కవిత్వం రాశారా ? (రాళ్లబండి కుటుంబ రావు)
లేదండి !! నేనెప్పుడూ కాగితం మీదే రాస్తాను (శ్రీశ్రీ)
అట్లు చెప్పనా? (హోటల్ లో స్నేహితుడు)
అట్లే కానిమ్ము (శ్రీశ్రీ)
మీరు నాకు ఓ నాటిక రాసి పెట్టాలి (వల్లమ్ నరసింహా రావు)
ఏ నాటికైనా రాస్తాను మిత్రమా (శ్రీశ్రీ)
కొచ్చిన్ సిస్టర్స్ కవర్ పేజీ గా వేద్దామా (పత్రికా సంపాదకుడు)
ఎందుకొచ్చిన సిస్టర్స్ (శ్రీశ్రీ)
చలం గారు రాసిన యోగ్యతా పత్రం చదివితే ఇకే మహా ప్రస్తానం చదవక్కర లేదంటాను, మీరేమంటారు (పిచ్చి రెడ్డి)
మీరు సార్ధక నామధేయులంటాను (శ్రీశ్రీ)
మీ శిష్యరత్నమైన ఆరుద్ర మీద మీ అభిప్రాయం ఏమిటి (విలేఖరి )
నా శిష్యుడంటే అతనొప్పుకోడు. అతగాడు రత్నమంటే నేనొప్పుకోను (శ్రీశ్రీ)
ఇక్కడ వేడి తేనీరు దొరుకును (హోటల్ ముందు బోర్డు)
అరే!! ఇక్కడ వెడితే కానీ నీరు దొరకదా (శ్రీశ్రీ)
కుక్కలున్నవి జాగ్రత్త (ఓ ఇంటి ముందు బోర్డు)
అరే !! ఇంతకు ముందు ఇక్కడ మనుషులు ఉండేవారే (శ్రీశ్రీ)
కవులు హాలికులైతేనేమి అన్నారు పోతన, ఆల్కహాలికులైతే నేమి అంటాడు శ్రీశ్రీ
మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే. సీసా లేబిల్ మార్చేస్తే సారా బ్రాందీ అగునే ...సిరిసిరిమువ్వా (శ్రీశ్రీ)
టైంకు రావడం శాస్త్రీయం, టైంకు రాకపోవడం కృష్ణ శాస్త్రీయం (శ్రీశ్రీ)
ఉగ్గేలా త్రాగుబోతుకు, ముగ్గేలా తాజమహల్ మునివాకిట్లో. విగ్గేలా కృష్ణ శాస్త్రి కి, సిగ్గేలా భావ కవికి సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్లకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్, పళ్లూడిన ముదుసలి కుచ్చిళ్ళను సవరించినట్లు సిరిసిరి మువ్వా (శ్రీశ్రీ)
అరిచే కుక్కలు కరవవు, కరిచే కుక్కలు మొరగవు, కరవక మొరిగే కుక్కలు తరమవు, అరవక కరిచే కుక్కలు మరలవు, అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు (శ్రీశ్రీ)
ఇస్పేటు జాకీలం, ఎగేసిన బాకీలం, మృత్యువు సినిమా లో మూడు బాషల టాకీలం, భగవంతుని టోపీలం, కవిత్రయపు కాపీలం, గోరంతలు కొండంతలం (శ్రీశ్రీ)
ReplyForward |
No comments:
Post a Comment