Tuesday, April 23, 2019

*ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు!*

**********************************
 🌷 *రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారి కోర్టు అనుభవాలు*   🙏
🙏 
*********************************
👉1.ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి .
మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో,
మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి .

👉2.మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్ గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు . మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు .
అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది .ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది .

👉3.మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు , అనవసరం కూడా.

👉4.ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి .వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు .ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి .మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి .

👉5.మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.

👉6.మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. 

వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం .

👉7.మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం 
ఎంతమాత్రమూ లేదు అలా ఆశించకండి ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి .

👉8.మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి .

👉9. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం .ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికిరాకుండా పోయేలా చూసుకోరాదు.

👉10.మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది

 మీ సంతానానికి దేవుడిచ్చిన వరం .

సాధ్యమైనంత వరకూ ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి 
ఇది *తన జీవిత కాలం*  సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన *ఒక జడ్జిగారి అనుభవ సారం* .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment