Wednesday, March 10, 2021

Brahmi n Raviteja

 -బ్రాహ్మి : ఒక ఏనుగు దగ్గర 12 అరటి పండ్లు పెట్టాను

             కానీ అది 11 తిన్నది 

             ఒకటి మాత్రం తినలేదు ఎందుకు ?


రవి తేజ : కడుపునిండింది అనుకుంటా


బ్రాహ్మి : కాదు12 వ అరటిపండు ప్లాస్టిక్ ది


రవి తేజ : అబ్బా ..చా🤷


బ్రాహ్మి : ఈసారి 12 అరటిపండులో 

            ఒకటి కూడా తినలేదు ఎందుకు


రవి తేజ : నాకు తెలుసు నాకు తెలుసు

              అవన్నీ ప్లాస్టిక్ వి


బ్రాహ్మి : కాదు ఏనుగు ప్లాస్టిక్ ది


రవి తేజ :.   నీ.....🤺


బ్రాహ్మి : ఈసారి నిజమైన ఏనుగుకి నిజమైన

            అరటిపళ్ళు పెట్టాను అయినా తినలేదు

            ఎందుకు ?


రవి తేజ : ఎందుకు..


బ్రాహ్మి : ఈ ఏనుగు టీవీ లో ఉంది 

            అరటి పళ్ళు బయట ఉన్నాయి


రవి తేజ : ఒరేయ్ నువ్వు నా చేతులొ 

               అయిపోతావ్🤺


బ్రాహ్మి : నీకు దమ్ముంటే ఇది ఒకటి చెపు, 

            నిజమైన ఏనుగు నిజమైన అరటిపళ్ళు 

            టీవీ లో ఉన్నాయి అయినా ఏనుగు 

            ఒక్కటి కూడా తినలేదు ఎందుకు ?


రవి తేజ : నావల్ల కాదు నువ్వే చెప్పు


బ్రాహ్మి : ఆ రెండు వేరే వేరే చానల్స్ లో ఉన్నాయి


రవి తేజ : ఆగ రా నాయాల ఈ రోజు 

              నా చేతుల్లో నువ్వైపోయావు😂😂😂


No comments:

Post a Comment