Tuesday, January 15, 2019

House wife

*మూలాలకు తరలి వెళదాం...*
👍👍👍👍👍👍👍👍👍👍
"నాన్నగారు...! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు. పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు... ఎందుకని నాన్నా... " నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.
"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే పిలుస్తారు చంద్రశేఖరం గారు...
"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు చంద్రశేఖరం గారు.
విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్న కూచి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది. కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.
"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆతర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్టేరు.  పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది. వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది. మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. నువ్వు ఉద్యోగం చేస్తే, ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... మన చదువు విజ్ఞానాన్ని ఇవ్వాలి కానీ మరొకరి భవిష్యత్తును కాలరాసేది గా ఉండకూడదు, మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పేను.
మీ అందరికి గుర్తుండే ఉంటుంది... మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."
కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.
"చదువు జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అవసరానికి మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"
"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?" ప్రశ్నించింది వైష్ణవి.
"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"
" నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.
"అమ్మా సుహాసిని, నీ సంగతి?"
"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"
"వైష్ణవి, నీకు చేయించిన నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"
"నా దగ్గరే, బాంక్ లో డబ్బులు ఉన్నాయి"
"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"
"లేవు"
"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీధనం, స్త్రీస్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.
"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. స్త్రీ భావి తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి. 
పగలంతా ఉద్యోగం పేరుతో ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం, కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... అవసరం అంటావా?"
అందని దూరాలకు పరుగులెత్తి,  అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం" ముగించారు చంద్రశేఖరం గారు.
"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు మొదట్లో కోపం వచ్చినా, మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం.  ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ, బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది.  వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.
"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."
"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...
"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం.. నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి
"అంతేనంటావా.. "
"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...
"హారి భడవా... రికార్డ్ చేసేసావు... కానియ్... ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను ఆడిపోసుకునే మన కుటుంబంలో ని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."
"సరే.. రండి.. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే *శతమానం భవతి* సినిమా వస్తోంది... చూద్దాం.."
*కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Nine Truths of Evidence

Nava-prameya-siddhanta  (Nine Truths of Evidence  )
by Bhaktivinoda Thakura
***************************
Q. What command has the supremely worshipable Shri Chaitanya Mahaprabhu given to us?
A. His order is this: that we very carefully observe the nine instructions of truth that Shri Madhvacarya has given us through the guru-parampara (disciplic succession).
*********************************
Q. Who forms the guru-parampara?
A. The adi-guru (original guru) of all the spiritual masters in the disciplic succession is Bhagavan, the Supreme Personality of Godhead. Showing His great mercy, He gave instructions in the truth to Lord Brahma, the adi-kavi (original poet). These truths were in turn taught by Brahma to Shri Narada, by Narada to Vyasa, and successively from Vyasa to Shri Madhvacarya. Such instructions received through this disciplic succession are called Guru-Parampara-Upadesa.
******************************
Q. What are the names of these nine instructions given by Shri Madhvacarya?
A. Their names are thus:
1) Bhagavan alone is the Supreme truth, one without a second.
2) He is the object of knowledge in all the Vedas.
3) The universe is real [satya].
4) Differences [between Isvara, jiva and matter] are real.
5) Jiva souls are the servants of Lord Hari.
6) All souls are different according to their different situations.
7) Liberation [moksa] is the name of attainment of Bhagavan's feet.
8 Bhagavan's pure worship [amala bhajana] is the only way to attain liberation.
9) Pratyaksa [direct perception], anumana [logic], and sabda [spiritual sound] are the three types of evidence.

Kaliyug Predictions

11 Kaliyug Predictions Ved Vyasa Made That Actually Came True
In Srimad Bhagavatam, Vyasa had predicted the grim situations that would take place in Kaliyug.
_1. In Kali Yuga, wealth alone will be considered the sign of a man’s good birth, proper behaviour and fine qualities. And law and justice will be applied only on the basis of one’s power. - Srimad Bhagavatam 12.2.2_
2. Men and women will live together merely because of superficial attraction, and success in business will depend on deceit*. Womanliness and manliness will be judged according to one’s expertise in sex, and a man will be known as a brahmana just by his wearing a thread. - Srimad Bhagavatam 12.2.3
_3. As the earth thus becomes crowded with a corrupt population, whoever among any of the social classes shows himself to be the strongest will gain political power.- Srimad Bhagavatam 12.2.7_
4. The citizens will suffer greatly from cold, wind, heat, rain and snow.* They will be further tormented by quarrels, hunger, thirst, disease and severe anxiety. -Srimad Bhagavatam 12.2.10
_5. Men will no longer protect their elderly parents. - Srimad Bhagavatam 12.3.42_
6. Cities will be dominated by thieves, the Vedas will be contaminated by speculative interpretations of atheists, political leaders will virtually consume the citizens, *and the so-called priests and intellectuals will be devotees of their bellies and genitals. – Srimad Bhagvatam 12.3.32*
7. Servants will abandon a master who has lost his wealth, even if that master is a saintly person of exemplary character. Masters will abandon an incapacitated servant, even if that servant has been in the family for generations. – 12.3.36
8. In Kali-yuga men will develop hatred for each other even over a few coins. Giving up all friendly relations, they will be ready to lose their own lives and kill even their own relatives
. -Srimad Bhagavatam 12.3.41*
*9. Uncultured men will accept charity on behalf of the Lord and will earn their livelihood by making a show of austerity and wearing a mendicant’s dress. Those who know nothing about religion will mount a high seat and presume to speak on religious principles. -Srimad Bhagavatam 12.3.38*
10. The maximum duration of life for human beings in Kali Yuga will become 50 years. -
Srimad Bhagavatam 12.2.11
_11. Religion, truthfulness, cleanliness, tolerance, mercy, duration of life, physical strength and memory will all diminish day by day because of the powerful influence of the age of Kali. -
Srimad Bhagavatam 12.2.1_📿

Tuesday, January 1, 2019

Who is a Vaishnava?

Many years back there was a disciple in Sri Vaishnava Sampradaya, at Srirangam, who once asked Parasara Bhatt `what are the true qualities of a Vaishnava? Parasara Bhatt did not give a direct answer and instead instructs this devotee to go to Tirupati and ask this question from Ananta Acharya. The devotee, after several days of travel, reached Tirupati. After reaching there he met Ananta Acharya and asked the same question. To his surprise, Ananta Acharya ignores his question. When the devotee observes that Ananta Acharya didn’t reply he feels that may be he is not qualified to ask such a question or may be didn’t ask the question in a submissive mood and he needs to become more humble. He then start serving the temple and devotees. After some time there was a festival in the temple and a lot of devotees were attending it. Ananta Acharya saw this devotee sitting down and waiting to honour the prasadam. He asked the devotee to first serve all the other devotees before taking his prasadam. The devotee readily gets up and enthusiastically serves till the last guest was fed.
After the festival was over Ananta Acharya called this devotee and told him that he will now reply to his question. He answered that a true Vaishnava is like a crane, like a hen, like salt and like you. The devotee thanked him but he could not understand its real meaning. He comes back to Parasara Bhatt, narrates him the whole story and then requests him to explain its meaning to him. Parasara Bhatt, of course, understood it all and explained as :

Crane: A crane stands on one leg for hours and keep looking in the water. If he sees a small fish, he let it pass but as soon as he sees a big fish he immediately catches it. Similarly a Vaishnava does not want to hear the talk of mundane people who are like small fish but he is eager to feast on the wisdom of great devotees who are like a big fish. Also a crane’s colour is white, symbol for purity and pure goodness. In the same way the heart of a Vaishnava is always completely pure and his actions are always for the good of others. Another quality of a crane is that during the change of season a crane flies hundreds of kilometers to a new country/region. Similarly when a Vaishnava sees that a place in which he is living is full of material dealings, he will leave that place and seek the association of true devotees elsewhere.

Hen: A hen goes to garbage bins which are full of rubbish and picks out some very wholesome seeds, it eats them and feeds them to the kids. Similarly, a Vaishnava is Saragrahi, he is only concerned with the essence not with other things. So a vaishnava picks up the essence of all the shastras, filtering out the rest, and gives the same to others as well.

Salt: When we taste a delicious preparation, we usually glorify different items but not the salt. Actually it is the salt which brings out the flavour in any preparation but no one talks about it, it remains hidden. Similarly a true Vaishnava is forever willing to do great service and yet he doesn’t want any glory for himself and wants to remain hidden. As as in order to give flavor to the preparation, the salt is willing to melt and completely willing to give up its identity, similarly, a Vaishnava too is willing to give up everything just to serve the devotees.

You : It means that like you served other devotee, a vaishnava always serves others.
What a beautiful way to explain the characteristics of a Vaishnava!